Manchu Vishnu: కంచు మోగించిన మంచు విష్ణు.. మా అధ్య‌క్ష పీఠంపై మంచు వార‌బ్బాయి

Manchu Vishnu: మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు మునుపెన్నడూ లేనంతగా రక్తి కట్టించిన సంగతి తెలిసిందే. ఈసారి మునుపెన్నడూ లేనంతగా సీనియర్ స్టార్లు అగ్ర హీరోలు వచ్చి ఛాంబర్ లో ఓట్లు వేసి వెళ్లారు. ఇరుగు పొరుగు నగరాల నుంచి కూడా విమానాల్లో వచ్చి ఓట్లు వేసి వెళ్లారు ఆర్టిస్టులు. ఇక ఎలక్షన్ ముందు ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెళ్ల వార్ గురించి వార్ ఆఫ్ వర్డ్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Manchu Vishnu

 

న‌రాలు తెగ ఉత్కంఠ‌తో ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌ర‌గ‌గా, ఎన్నికల ఫలితాలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చేశాయి. గెలిచినవారి జాబితాను బయటకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు.

400 ఓట్స్ మెజారిటీతో మంచు విష్ణు గెలిచారు. ప్ర‌కాశ్ రాజ్ ఆఫీస్ బ్యార‌ర్ లో శ్రీకాంత్ ఒక్క‌డే విజ‌యం సాధించాడు. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ర‌ఘుబాబు గెలుపు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల ర‌వి, జాయింట్ సెక్ర‌ట‌రీగా గౌతం రాజు, ట్రెజ‌ర‌ర్‌గా శివ బాలాజీ విజ‌యం సాధించారు. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌లో శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా హేమ‌, ఈసీ మెంబ‌ర్స్‌గా అన‌సూయ‌, కౌశిక్‌, శివా రెడ్డి, సురేష్ కొండేటి విజ‌యం సాధించారు. మా పీఠం మంచు ఫ్యామిలీకి ద‌క్క‌డంతో సెబ్రేష‌న్ భారీగా జ‌రుగుతున్నాయి. .

మోహ‌న్ బాబు ద‌గ్గ‌రుండి త‌న కొడుకుని గెలిపించారు. నాలుగు వంద‌ల‌కు పైగా ఓట్స్‌తో విష్ణు గెల‌వ‌డం మాములు విష‌యం కాదు. వ‌న్‌సైడ్‌గా పోలింగ్ జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. మంచు విష్ణు గెలవ‌గానే, ప్ర‌కాశ్ రాజ్ అక్క‌డ క‌నిపించ‌లేదు. అత‌నికి నాన్ లోక‌ల్ బాగానే దెబ్బ‌తీసింద‌ని అంటున్నారు.