Manchu Vishnu Took Sensational Decision : మంచు విష్ణు సంచలన నిర్ణయం.. వారికి భయపడుతున్నాడా..?

NQ Staff - August 1, 2023 / 09:33 AM IST

Manchu Vishnu Took Sensational Decision : మంచు విష్ణు సంచలన నిర్ణయం.. వారికి భయపడుతున్నాడా..?

Manchu Vishnu Took Sensational Decision :

మంచు విష్ణు ఆ నడుమ ఎంతగా కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఆయన్ను ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. అనవసరంగా ఏవేవో మాట్లాడి అప్పటి వరకు ఎలాంటి విమర్శలు లేకుండా ఉన్న ఆయన.. నవ్వులు పాలు అయ్యాడనే చెప్పుకోవాలి.

ఇక ఎన్ని జరిగినా ఆయన మా అధ్యక్షుడిగా గెలిచారు. అయితే మా ఎలక్షన్ల సమయం నుంచే మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి చెడిందనే వాదన ఉంది. అప్పటి నుంచే మెగా ఫ్యామిలీతో విష్ణు టచ్ లో ఉండట్లేదు. పైగా తనపై ట్రోల్స్ చేయిస్తోంది మెగా ఫ్యామిలీనే అని ఇన్ డైరెక్టుగా ఆరోపణలు కూడా చేశాడు.

ఎన్నికలు అప్పుడే..

ఇదిలా జరుగుతుండగా.. తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న మా అసోసియేషన్, మెడికవర్ ఆధ్వర్యంలో మా సభ్యులకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో అందరూ హెల్త్ చెకప్ లు చేయించుకోవాలన్నారు. విష్ణు మాట్లాడుతూ.. మా అసోసియేషన్ ఎన్నికలు వచ్చే మే లేదా జూన్ నెలలో జరుగుతాయి.

కానీ ఇకపై నేను మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయను అంటూ సంచలన ప్రకటన చేశారు. ఎందుకో మాత్రం చెప్పలేదు. అయితే మంచు విష్ణు తనపై తన ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ ను తట్టుకోలేకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అర్థం అవుతోంది. మెగా ఫ్యామిలీకి భయపడే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అర్థం అవుతోందని అంటున్నారు కొందరు నెటిజన్లు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us