Manchu Vishnu : నేను నెంబర్ వన్ కన్నింగ్ ఫెలోని: మంచు విష్ణు సంచలన వ్యాఖ్య

NQ Staff - September 27, 2022 / 08:50 PM IST

Manchu Vishnu : నేను నెంబర్ వన్ కన్నింగ్ ఫెలోని: మంచు విష్ణు సంచలన వ్యాఖ్య

Manchu Vishnu : సినీ నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, తన గురించి తాను సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘జిన్నా’ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి.? రియల్ లైఫ్‌లోనూ అలాగే వుంటారా.? అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రశ్న ఎదురైతే, ‘‘నా రియల్ లైఫ్ క్యారెక్టర్ ‘ఢీ’ సినిమాలో నా పాత్రలా వుంటుంది..’ అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

‘నేను చాలా కన్నింగ్.. నెంబర్ వన్ కన్నింగ్ ఫెలోని నేను..’ అంటూ తన గురించి తాను విష్ణు చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.

తనను తానే ట్రోల్ చేసుకున్న విష్ణు..

ఎవరన్నా విష్ణుని కన్నింగ్ ఫెలో అనంటే ఆయన ఊరుకుంటాడా.? అస్సలూరుకోడు. ఎవరైనా ట్రోల్ చేస్తే విష్ణుకి కష్టంగానీ, తనను తాను ట్రోల్ చేసుకోవడానికి ఇష్టపడతాడేమో.. అన్నట్లుంది అతని ‘కన్నింగ్ ఫెలో’ స్టేట్మెంట్.

విష్ణ హీరోగా ‘జిన్నా’ సినిమా తెరకెక్కిన విషయం విదితమే. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ ఈ సినిమాలో హీరోయిన్లు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది. నిజానికి, అక్టోబర్ 5న సినిమా విడుదల అని అనుకున్నారుగానీ, అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమయ్యింది.

ఇదిలా వుంటే, ‘నేను నెంబర్ వన్ కన్నింగ్ ఫెలోని..’ అని విష్ణు చేసిన వ్యాఖ్యలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us