Manchu Vishnu: అంకుల్, మీ నిర్ణ‌యం స‌రైన‌ది కాదు.. నాకు ద‌యచేసి రిప్లై ఇవ్వకండి

Manchu Vishnu: తొలి నుంచి వివాదాలు..వాగ్వాదాలు..విమర్శలు..వ్యక్తిగత ఆరోపణలతో సాగిన ఎన్నికల్లో అనూహ్యంగా భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఉత్కంఠ‌గా సాగిన కౌంటింగ్ లో అన్ని విభాగాల్లోనూ విష్ణు ప్యానల్ మెజార్టీ సాధిస్తూ వచ్చింది. ప్రకాశ్ రాజ్ తో పాటుగా ఆ ప్యానల్ లో కీలకంగా పని చేసిన జీవిత సైతతం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయారు.

మెగా క్యాంపు మద్దతుతో ప్రకాశ్ రాజ్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక, బరిలో దిగిన విష్ణుకు తండ్రి మోహన్ బాబు తొలి నుంచి అండగా నిలిచారు. అన్నీ తానై కుమారుడి విజయం కోసం శ్రమించారు. హీరో నరేశ్ సైతం విష్ణుకు మద్దతుగా నిలిచి విజయం కోసం పోరాడారు. 107 ఓట్ల తేడాతో ప్ర‌కాశ్ ఓడిపోయారు.

ఎన్నిక‌ల‌లో దారుణంగా ఓడిపోవ‌డంతో ప్ర‌కాశ్ రాజ్ మా స‌భ్య‌త్వం నుండి తాను త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని కూడా త‌న వాట్సప్ చాట్ ద్వారా తెలియ‌జేశాడు. అద్భుత‌మైన విజయం సాధించినందుకు శుభాకాంక్ష‌లు. నేను మా మెంబ‌ర్ షిప్‌ని వ‌దులుకోద‌లిచాను. నా నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తావ‌ని ఆశిస్తున్నాను. మెంబర్ స‌భ్యుడిగా లేక‌పోయిన నేను నీకు ఎల్ల‌ప్పుడు స‌పోర్ట్‌గా ఉంటాను అని ప్ర‌కాశ్ రాజ్ అన్నారు.

డియ‌ర్ అంకుల్ థ్యాంక్యూ.. మీ నిర్ణ‌యంతో నేను హ్య‌పీగా లేను. మీరు నా క‌న్నా చాలా పెద్ద వాళ్లు. జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్ రెండు ఉంటాయి. ఈ రెండింటిని మ‌నం స్వాగ‌తించాలి. మీరు ఎమోష‌న‌ల్ కావొద్దు. మీరు మా ఫ్యామిలీలో ఓ భాగం. మీ స‌ల‌హాలు, సూచ‌న‌లు నాకు కావాలి. మ‌నం క‌లిసి పని చేద్దాం. నాకు మీరు తిరిగి స‌మాధానం ఇవ్వ‌ర‌ని భావిస్తున్నాను. త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని క‌లిసి ఈ విష‌యంపై డిస్క‌స్ చేస్తాను. ఐ ల‌వ్ యూ అంకుల్, అసహ్యించుకోవ‌ద్దు అంటూ విష్ణు తెలిపాడు.