DNA Test: స‌ర‌దా కోసం కొడుక్కి డీఎన్ఏ టెస్ట్‌.. రిజ‌ల్ట్ చూసి కంగుతిన్న తండ్రి

DNA Test: పెళ్లైన త‌ర్వాత ప్ర‌తి మ‌హిళ త‌ల్లి ప్ర‌మోష‌న్ అందుకోవాల‌ని ఎంతగానో క‌ల‌లు కంటుంది. కాని కొన్ని సంద‌ర్భాల‌లో అది కుద‌ర‌దు.దీంతో వేరే మార్గాల‌ను ఎంచుకుంటారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) అంటే కృత్రిక గర్భధారణ విధానంతో కూడా కొంద‌రు పిల్ల‌ల్ని కంటున్నారు. అయితే ఈ విధానంతో పిల్ల‌ల్ని క‌నాల‌నుకున్న జంట‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది.


Man Shocked By seeing His Son DNA Test Results
Man Shocked By seeing His Son DNA Test Results


వివ‌రాల‌లోకి వెళితే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి వినోదం కోసం తన కొడుకుకు డీఎన్ఏ టెస్టు చేయించాడు. ఎంతో ఆతృతతో రిపోర్టును చూసిన ఆ తండ్రి నోరెళ్ల‌పెట్టాడు. అమెరికాలోని ఉటా ప్రాంతానికి చెందిన డోనా, వన్నెర్ జాన్సన్ దంపతులు కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కుమారుల తండ్రి అయిన వన్నెర్ జాన్సన్ 12 ఏళ్ల తరువాత వినోదం కోసం తన రెండవ కుమారునికి డిఎన్ఏ టెస్టు చేయించాడు.


ఆ టెస్ట్‌లో బాలుడు త‌మ కుమారుడు కాద‌ని తెలిసింది. దీంతో అత‌ను గుడ్లు తేలేశాడు. ఐవీఎఫ్‌ సమయంలో ఫ్యూజన్‌(కలయిక)లో పొరపాటు చోటుచేసుకున్న కారణంగా ఈ సమస్య తలెత్తింది. డోనా, వన్నెర్ జాన్సన్ దంపతులు రెండవ సంతానం కోసం 2007లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) అంటే కృత్రిక గర్భధారణ విధానాన్ని ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానంలో డోనా గర్భం దాల్చి కుమారునికి జన్మనిచ్చింది.


12 ఏళ్ల తరువాత వన్నెర్ జాన్సన్ తన రెండవ కుమారునికి డీఎన్ఏ టెస్టు చేయించ‌గా,రిపోర్డ్ త‌ప్పుగా ఉంది. దీంతో వన్నెర్ జాన్సర్ తన భార్యకు ఐవీఎఫ్ చికిత్స అందించిన క్లినిక్‌పై కేసు వేశారు. వన్నెర్ జాన్సన్ తీసుకున్న రిపోర్టులో తన రెండవ కుమారుని తల్లి పేరు డోనా అని ఉండగా, తండ్రి ఎవరో తెలియదంటూ ఉంది. దీనిపై దర్యాప్తు చేపట్టగా, ఒక ఫ్యూజన్‌లో పొరపాటు చోటు చేసుకున్నదని తేలింది. డోనాకు సంబంధించిన అండం వేరొకరి వీర్యంతో ఫ్యూజన్ అయ్యిందని తేలింది.