చికెన్ కు శానిటైజ్ చేసి తిన్నాడు. చివరకు ఇలా అయ్యింది.

Advertisement

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరిస్తున్నారు. అలాగే ఎల్లవేళలా చేతలను శానిటైజ్ చేసుకుంటున్నారు. అలాగే తరుచు వాడే వస్తువులను కూడా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె ఓ వ్యక్తి చికెన్ కు శానిటైజ్ చేసి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

వివరాల్లోకి వెళితే కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే యాకుబ్ అనే వ్యక్తి కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇక యాకుబ్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం యాకుబ్ చికెన్‌ తీసుకొచ్చాడు. ఇక చికెన్‌ వండిన తరువాత కరోనా వైరస్ భయంతో ఆ చికెన్ లో శానిటైజర్‌ కలిపాడు.

ఇక శానిటైజర్ కలపడంతో వాసన రావడంతో తన భార్య, పిల్లలు ఆ చికెన్ తినలేదు. దీనితో యాకుబ్ ఒక్కడే చికెన్ తిన్నాడు. ఇక చికెన్ తిన్నాక కొద్దిసేపటి తరువాత యాకుబ్ కు వాంతులు అయ్యాయి. దీనితో వెంటనే ఆయనను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. పేగులకు గాయాలు అయినట్లు ఎంజిఎం వైద్యులు తేలిపారు.

అయితే ఎంజిఎం ఆసుపత్రిలో కరోనా బాధితులు ఉన్నారని భయంతో తిరిగి తన గ్రామానికి వచ్చాడు. ఇక ఇంటి దగ్గర చికిత్సకు డబ్బులు లేకపోవడంతో యాకుబ్ కు కాళ్లూ, చేతులు పని చేయడం లేదు. ఇక ఈ విషయం వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి యాకుబ్ కు సాయం చేస్తామని పలువురు నాయకులు యాకుబ్ కు హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here