‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం.

హైదరాబాద్ రవీంద్ర భారతి దగ్గరలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. అయితే తెలంగాణ వచ్చిన తరువాత నాకు ఎలాంటి న్యాయం జరగలేదని రోదిస్తూ పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నడు. ఘటన స్థలంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పీ అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యయత్నం చేసుకున్న వ్యక్తి మహాబూబ్ నగర్ జిల్లా లోని కడ్తల్ గ్రామనికి చెందిన వాసి రాములుగా గుర్తించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా మా బతుకులు మారలేదని బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు. కేసీఆర్ సార్.. జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు. నేను ఉద్యమంలో పాల్గొన్ననని నన్ను ఆదుకోవాలంటూ చేతులు జోడించి ప్రాదేయపడ్డాడు. ఇక ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి శరీరం సగం కాలిపోయింది. వెంటనే బాధితున్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.