Mallika Sherawat Reacts About Casting Couch : ఛాన్సులు రావాలంటే హీరోల పక్కలో పడుకోవాల్సిందే.. స్టార్ హీరోయిన్ సెన్సేషన్..!
NQ Staff - August 3, 2023 / 11:27 AM IST

Mallika Sherawat Reacts About Casting Couch :
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక మహమ్మారిలా వ్యాపించింది. దీని బారిన పడకుండా ఎవరూ ఎదగట్లేదనే వాదన వినిపిస్తోంది. అయితే దీనిపై కొందరు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకెవరూ పెద్దగా స్పందించట్లేదు. కానీ దీన్ని ఎదుర్కుని కొందరు మాత్రమే స్టార్లుగా ఎదుగుతున్నారు.
మరికొందరు మాత్రం ఎంచక్కా కమిట్ మెంట్లు ఇచ్చేసి కూడా స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బాంబ్ మల్లికా శెరావత్. ఆమె అప్పట్లో ఎక్కువగా బోల్డ్ సినిమాల్లో నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది.
వారి దగ్గరకు వెళ్లాల్సిందే..
అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. మల్లికా శెరావత్ మాట్లాడుతూ.. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధలు పడ్డాను. అప్పట్లో నేను హీరోలకు కమిట్ మెంట్ ఇవ్వకపోవడంతో చాలా సినిమాల నుంచి తీసేశారు. కొందరు హీరోలు అయితే వారి కోరికలు తీర్చలేదని.. నాకు ఛాన్సులు రాకుండా చేశారు.
నా ట్యాలెంట్ కు అవకాశాలు ఇవ్వలేదు. లేదంటే నేను కూడా పెద్ద స్టార్ అయ్యేదాన్ని. కెరీర్ లో సాగాలంటే హీరోతో గడపడం తప్పనిసరి అని బాంబు పేల్చింది. నువ్వు బోల్డ్ సినిమాల్లో నటిస్తున్నావ్ కదా.. నిజ జీవితంలో అలా చేస్తే తప్పేంటి అంటూ కొందరు నీచంగా మాట్లాడారని తెలిపింది ఈ బ్యూటీ.