ఇండియాను అవమానించాలని చూసిన చైనా జర్నలిస్ట్ కి…మహీంద్రా ఛైర్మన్ హైలైట్ కౌంటర్!

Advertisement

ఇండియాను అవమానించాలని చూసిన ఒక చైనా జర్నలిస్ట్ కి మన ఇండియాకి
చెందిన దిగ్గజ కంపనీ అయినటువంటి మహింద్ర సంస్థ యొక్క చైర్మన్ దిమ్మ తిరిగే పోయే కౌంటర్ ఇచ్చాడు.అసలు ఆ జర్నలిస్ట్ ఎం అన్నాడు .. దానికి టెక్ మహింద్ర చైర్మన్ అయినటువంటి ఆనంద్ మహింద్ర ఏ విధంగా సమాధానం తెలిపాడు అన్న పూర్తి వివరాల్లోకి వెళితే …

కొంత కాలం క్రిందట భారత సరిహద్దులో చైనా తో జరిగిన గాల్వన్ ఘటన లో 20 మంది భారత సైనికులు చనిపోవడం. దానికి ప్రతీకారంగా భారత్ లో వాడుతున్న అన్ని చైనా అప్స్ ని కూడా బాన్ చేయడం జరిగింది . దానితో ఒక్క సారిగా చైనా ఆర్థిక పరంగా 6 మిలియన్ డాలర్లు పైగా నష్టాలను చవిచూడడం జరిగింది . అయితే భారత్ లో ఏంతో మంది చైనా అప్ లలో ఒకటి అయిన టిక్ టాక్ కి ఎంతలా అడిక్ట్ అయ్యారు అంటే .. వాళ్ళ రోజు వారి జీవితం లో టిక్ టాక్ కూడా ఒకటి అన్నంతలా టిక్ టాక్ కి ఎడిట్ అవ్వడం జరిగింది . అయితే గాల్వన్ ఘటన తరువాత టిక్ టాక్ తో సహా 58 ఆప్ లని బాన్ చేసే క్రమం లో చాలా మంది టిక్ టాక్ బాన్ చేసే విషయం లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ చైనా చేసిన పనికి ప్రతీకారంగా ఆ అప్ ని బాన్ చేయడం అన్న విషయం లో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది … అయితే దీని పైన ఒక చైనా జర్నలిస్ట్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ మీలాగే చైనా వాళ్ళు కూడా భారత్ ఆప్ లని తొలగించాలని అనుకున్నప్పటికీ అసలు మీరు తయారు చేసిన మంచి ఆప్స్ ఏమి కూడా కనపడవు . మీ జాతీయత కి ఇచ్చే ప్రాధాన్యత లో కొంత మీ టెక్నాలజీ పెంపొందించుకోవడం లో చూపించుకోండి అన్న అర్ధం వచ్చేలా వెల్లడించడం జరిగింది .

దాని పైన స్పందించిన టెక్ మహింద్ర చైర్మన్ అయినటువంటి ఆనంద్ మహింద్ర అతనికి సరైన సమాధానం ఇచ్చాడు . నాకు తెలిసి ఇండియా అందుకున్న కామెంట్ల లో చాలా ప్రభావితం చేసే, ప్రేరేపించే కామెంట్ ఇదే. ఇలా మమ్మల్ని రెచ్చగొట్టినందుకు ధన్యవాదాలు. చాలా తొందరలో మేము ఆ స్థాయికి ఎదుగుతాం” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ విధంగా అదిరిపోయే సమాధానం ఇస్తూనే మరొక విషయాన్ని తెలియ చేసాడు . . నేను మీ చైనా ప్రొడక్ట్స్ ని ఎప్పుడు ప్రోత్సహించలేదు … నేను నా జీవితం లో మా దేశం లో బాగా పేరు సంపాదించుకున్న చైనా ఆప్ టిక్ టాక్ ని ఇంస్టాల్ చేసుకోలేదు …. కానీ టిక్ టాక్ ల కాదు దాని కంటే చాలా మంచి ఆప్ మరియు భారత దేశం ద్వారా తయారు చేయబడిన చింగారి ఆప్ ని ఇంస్టాల్ చేసుకోవడం జరిగింది . నాకు తెలిసి మీ అప్ ల కంటే ఇది మరింత త్వరగా మరియు ఎక్కువ డౌన్లోడ్స్ ని సంపాదించుకుంది . దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఇండియన్ ప్రోడక్ట్స్ అనేవి ఎంత పవర్ ఫుల్ అని అంటూ తెల్పడం జరిగింది .

ఈ విధంగా చైనా జర్నలిస్ట్ వ్యగ్యంగా ఇండియా పైన చేసిన కామెంట్ కి అదిరిపోయే కౌంటర్ లు ఇచ్చి అతని నోరు మూయించాడు ఆనంద్ మహింద్ర .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here