Mahesh Babu: మహేష్ బాబు డెడ్ లైన్.. ప‌రేషాన్ అవుతున్న‌ పరశురామ్..

Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నాడు. వరసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే సర్కారు వారి పాట సెట్స్ పైకి వెళ్లింది. మరోవైపు త్రివిక్రమ్, రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు కూడా ఈయనతో సినిమాలకు కమిట్ అయ్యారు. దాంతో స్పీడ్ ఇంకా పెంచేసాడు సూపర్ స్టార్. మధ్యలో కరోనా బ్రేకులు పడినా కూడా వాటిని కూడా కవర్ చేయాలని చూస్తున్నాడు మహేష్ బాబు.

parasuram mahesh babu
parasuram mahesh babu

అందుకే పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. ఓ సినిమా సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్ చేస్తున్నాడు సూపర్ స్టార్. కరోనా సమయంలో కూడా ఈయన యాడ్స్ చేశాడు. ఒకవైపు సర్కారు వారి పాట సినిమా చేస్తూనే మరోవైపు ఎండోర్స్ మెంట్ తో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక యాడ్ చేశాడు మహేష్. ఇంత బిజీగా ఉన్న ఈయన తాజాగా ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు.

అది గాని వర్కౌట్ అయిందంటేటే అభిమానులకు అంతకు మించిన సర్ప్రైజ్ మరొకటి ఉండదు. సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్టు సెట్ అయింది. చాలా సంవత్సరాలుగా ఇది పెండింగ్లోనే ఉంది. మరోవైపు త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దీనికోసం ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయింది. ఏడాదిన్నరగా త్రివిక్రమ్ కూడా ఖాళీగానే ఉన్నాడు. అందుకే మహేష్ సినిమాను త్వరగా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.

అందుకే పరశురామ్ కు డెడ్ లైన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. సర్కారు వారి పాట సినిమాను మరో మూడు నెలల్లోనే పూర్తి చేయాలని కోరినట్లు తెలుస్తుంది. జులై 15న ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు పరశురామ్. అంతేకాదు ఈ చిత్రం కోసం బల్క్ డేట్స్ కూడా ఇచ్చేసాడు సూపర్ స్టార్. ఆగస్ట్, సెప్టెంబర్ లో షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి 2022 కు సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. త్రివిక్రమ్ కోసమే పరశురామ్ ను కంగారు పెడుతున్నాడు సూపర్ స్టార్.

ఆ తర్వాత రాజమౌళి కూడా లైన్ లోనే ఉన్నాడు. ఏదేమైనా మహేష్ బాబు డెడ్ లైన్ తో పరశురామ్ కాస్త పరేషాన్ అవుతున్నాడు. కెరీర్ లో తొలిసారి సూపర్ స్టార్ తో పని చేస్తున్నాడు. దాంతో ఇంత పెద్ద సినిమాను త్వరత్వరగా పూర్తి చేస్తే ఫలితంపై ప్రభావం పడుతుందేమో అని టెన్షన్ పడుతున్నాడు ఈయన. అయితే మహేష్ మాత్రం మిగిలిన భాగం పూర్తి చేయడానికి మూడు నెలలు సరిపోతాయంటున్నాడు. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?