షూటింగ్ లో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు

Advertisement

కరోనా వల్ల దేశంలో దాదాపు అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కరోనా దేశంలో వచ్చినప్పటి నుండి మూవీ షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. థియేటర్స్ మూతపడటం వల్ల మూవీస్ కూడా రిలీజ్ కాలేదు. షూటింగ్స్ పూర్తి చేసుకున్న మూవీస్ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే దేశంలో అన్ లాక్ ప్రారంభం కావడం వల్ల మూవీ షూటింగ్స్ కు పెర్మిషన్ దొరికింది. దీంతో తక్కువ మంది సభ్యులతో షూటింగ్స్ చేస్తున్నారు.

షూటింగ్స్ పర్మిషన్ రావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఒక యాడ్ షూటింగ్ లో మహేష్ పాల్గొన్నారు. ఈ యాడ్ షూటింగ్ రెండు రోజులు జరగనుందని సమాచారం. త్వరలో మహేష్ సర్కారీ వారి పాట మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని మూవీ యూనిట్ తెలిపింది. ఇప్పటికే చాలా మూవీ షూటింగ్స్ జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here