Mahesh Babu Property Value : మహేశ్ బాబు ఆస్తి అన్ని కోట్లా.. డబ్బులు దాచుకోని ఏకైక హీరో..!
NQ Staff - August 9, 2023 / 11:30 AM IST

Mahesh Babu Property Value :
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా సూపర్ స్టారే అనిపించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎంత ఎత్తుకు ఎదిగారో.. బయట కూడా సేవా కార్యక్రమాల ద్వారా అంతే పేరు సంపాదించుకుంటున్నారు. చాలామందికి ఆయన చేసే సేవల గురించి పెద్దగా తెలియదు. కానీ ఆయన మాత్రం దాన్ని బయటకు చెప్పుకోరు.
మహేశ్ బాబు ఒక సినిమా చేస్తే వందల కోట్ల వసూళ్లు వచ్చి పడుతుంటాయి. కానీ ఆయన మాత్రం ఎన్నడూ కమర్షియల్ గా ఆలోచించరు. సినిమా రిలీజ్ అయిన తర్వాతనే తన రెమ్యునరేషన్ తీసుకుంటారు. అందుకే ఆయన్ను అందరూ నిర్మాతల హీరో అని పిలుస్తుంటారు. ఇక చిన్న పిల్లలకు కూడా గుండె ఆపరేషన్లు చేయించి వేలాది మందికి జీవితాలను ప్రసాదిస్తున్నారు.
త్రివిక్రమ్ తో సినిమా..
ఇప్పటికే ఆయన వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు చేయించాడు. ఇంత మంచి మనసు ఉంది కాబట్టే.. ఆయన సినిమా కెరీర్ కూడా అంతే సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పుడు ఆయన వరుస హిట్లతో జోరు మీదున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత రాజమౌళితో సినిమా ఉంది.
కాగా మహేశ్ బాబు ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.70 కోట్ల దాకా తీసుకుంటున్నాడు. ఆయనకు బంజారా హిల్స్ లో రూ.40 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ఆయనకు యాడ్స్ ద్వారా కూడా ఏడాదికి రూ.30 కోట్ల వరకు వస్తుంటాయి. అటు బెంగుళూర్ లో కూడా విలాసవంతమైన ఇల్లు ఉంది. ఆయన నికర ఆస్తుల విలువ రూ.650 కోట్లు. రాజమౌళితో సినిమా తర్వాత ఆయన మార్కెట్, ,రేంజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.