Mahesh Babu Not Showing Interest In Guntur Karam Movie : షాకింగ్… గుంటూరు కారం సినిమా ఆగిపోనుందా.. సంచలన మ్యాటర్ లీక్..!
NQ Staff - July 29, 2023 / 10:36 AM IST

Mahesh Babu Not Showing Interest In Guntur Karam Movie :
మహేశ్ బాబు సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. టాలీవుడ్ లో ఆయన అగ్ర హీరోగా ఉన్నారు. అలాంటి హీరో సినిమా అంటే ఏ రేంజ్ లో ఏర్పాట్లు ఉంటాయో తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏ సినిమాకు రానన్ని ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఇది ఫ్యాన్స్ ను తీవ్రంగా కలవర పెడుతోంది.
ఆయన తప్పుకున్నాడా..?
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. షూట్ చేసిన సీన్లు బాగా రాలేదని వాటిని పక్కన పెట్టేశారు. ఇంకోవైపు హీరోయిన్ పూజాహెగ్డే తప్పుకుంది. ఆమె ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి వచ్చింది. కాగా రీసెంట్ గా సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ తప్పుకోగా ఆయన స్థానంలో రవి కె చంద్రన్ వచ్చారు.
ఫస్ట్ సింగిల్ రాబోతోందా..?

Mahesh Babu Not Showing Interest In Guntur Karam Movie
ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి తమన్ తప్పుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన మ్యూజిక్ బాగా ఇవ్వట్లేదని అంటున్నారు. అయితే ఆగస్టు 9న సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందంట. ఈ విషయాన్ని సినిమా టీమ్ తెలుపుతోంది. దాంతో సినిమా ఉంటుందని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటున్నారు.
కానీ ప్రస్తుతం మహేశ్ సినిమా షూటింగ్ ఆపేసి మరీ దుబాయ్ కు వెళ్లిపోయారు. ఆయన సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ గా లేనట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఆయన సినిమా ఉంటుందా లేదా అనేది. త్రివిక్రమ్ ఎక్కువగా పవన్ సినిమాలపై దృష్టి పెట్టడం వల్లే గుంటూరు కారం సినిమా వాయిదాలు పడుతోందని మహేశ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. చూడాలి మరి మూవీ నుంచి బిగ్ అప్ డేట్ ఉంటుందా లేదా అనేది.