SSMB28 : అదిరిపోయే కాంబో.. పట్టాలెక్కిన మహేశ్, త్రివిక్రమ్ సినిమా

SSMB28 : సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా అంటే మామూలుగా ఉండదు. అతడు సినిమా కానీ… ఖలేజా సినిమా కానీ.. వీళ్ల కాంబోలో వచ్చినవే. అతడు సినిమా అయితే ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో చెప్పక్కర్లేదు. అయితే… ఖలేజా సినిమా తర్వాత మళ్లీ వీళ్ల కాంబోలో సినిమా రాలేదు. అభిమానులు కూడా ఎప్పుడు వీళ్ల కాంబోలో సినిమా వస్తుందా? అని తెగ ఎదురు చూస్తున్నారు. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. మొత్తానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే అని ప్రకటించేశారు.

mahesh babu and trivikram combo movie announced
mahesh babu and trivikram combo movie announced

ఇవాళ సాయంత్రం వీళ్ల కాంబోలో వచ్చే సినిమా అప్ డేట్ ఇచ్చారు. మొత్తానికి వీళ్ల కాంబోలో సినిమా పట్టాలకెక్కబోతోంది. ప్రస్తుతం కరోనా దృష్ట్యా సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు కానీ.. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వడంతో పాటు సినిమాను వచ్చే వేసవికాలానికి విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

దానికి సంబంధించిన ఓ వీడియోను కూడా మూవీ యూనిట్ తాజాగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ముందు అనుకున్న సమయానికి వీడియోను రిలీజ్ చేయకపోయినా.. తర్వాత రిలీజ్ చేసి మహేశ్ బాబు అభిమానులకు సూపర్ సర్ ప్రైజ్ ను అందించింది మూవీ యూనిట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే అధికారికంగా మూవీ యూనిట్ ప్రకటించనుంది.

Advertisement