Mahesh Babu : నాన్నా నువ్వు మరింత గర్వపడేలా చేస్తా: మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్.!

NQ Staff - November 24, 2022 / 04:30 PM IST

Mahesh Babu : నాన్నా నువ్వు మరింత గర్వపడేలా చేస్తా: మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్.!

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయనను తలచుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు సోషల్ మీడియా వేదికగా.

‘నాన్నా.! మీ జీవితం చాలా గొప్పగా సాగింది. మీ నిష్ర్కమణ కూడా అంతే గొప్పగా జరిగింది. అదంతా మీ గొప్పతనం. జీవితం చివరి దశ వరకూ ధీశాలిగా, ధైర్య సాహసాలు కలబోసిన వ్యక్తిగా జీవించారు. మీ ధైర్య సాహసాలే నాకు స్పూర్తి.. అని రాసుకొచ్చారు మహేష్ బాబు.

లవ్ యూ నాన్నా..

Mahesh Babu An Emotional Tweet About Superstar Krishna

Mahesh Babu An Emotional Tweet About Superstar Krishna

అలాగే, గతంతో పోల్చితే ఇప్పుడు మరింత ధృఢంగా వున్నానన్నారు. ఇప్పుడు తనకు ఎలాంటి భయం లేదు అంటూనే, తండ్రిగా, ఓ నటుడిగా మీరు అందించిన వారసత్వాన్ని కొనసాగిస్తా.. మరింత గర్వపడేలా చేస్తానని ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు మహేష్ బాబు.

Mahesh Babu An Emotional Tweet About Superstar Krishna

Mahesh Babu An Emotional Tweet About Superstar Krishna

వెంటవెంటనే కుటుంబ సభ్యులను కోల్పోవడం మహేష్ బాబుకు తీరని లోటుగానే చెప్పాలి. మొదట ఆయన అన్నయ్య రమేష్ బాబు ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత తల్లి ఇందిరమ్మ చనిపోయిన కొద్దిరోజులకే తండ్రి కృష్ణ కూడా మరణించడం మహేష్ ‌బాబును కోలుకోలేకుండా చేసింది.

తాజా పోస్ట్ ప్రకారం ఇప్పుడిప్పుడే మహేష్ బాబు ఆ బాధ నుంచి కోలుకుంటున్నట్లు, తనను తాను మోటివేట్ చేసుకుంటున్నట్లుగా అర్ధమవుతోంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us