అహింసే ఆయుధంగా మార్చిన.. మహాత్ముడి 151వ జయంతి నేడు.

Admin - October 2, 2020 / 05:43 AM IST

అహింసే ఆయుధంగా మార్చిన.. మహాత్ముడి 151వ జయంతి నేడు.

జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా భారత్ లోనే కాకుండా ప్రపంచదేశాలు ఆ మహాత్మున్ని గుర్తుచేసుకుంటున్నాయి. తెల్ల దొరలైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నాడు ఉద్యమాన్ని చేసి జాతిపితగా నిలిచాడు. అయితే మహాత్మా గాంధీ అక్టోబర్ 2వ తేదీన 1869న గుజరాత్‌ రాష్ట్రంలోని పోర్బందర్ ‌లో జన్మించారు. మహాత్మాగాంధీ అసలైన పేరు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర్య సమరానికి కీలక పాత్ర పోషించారు గాంధీ. అయితే 1930లో దండి సాల్ట్ మార్చ్‌కు నాయకత్వం వహించారు. ఆ తరువాత 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. గాంధీ దక్షిణాఫ్రికాలో మరియు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఉపయోగించిన అహింసా మార్గాన నడిచారు.

దాంట్లో ఒక రూపమైన ‘సత్యాగ్రహం’ యొక్క తత్వశాస్త్రానికి మార్గదర్శకుడుగా నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికాలోని ఒక న్యాయవాది నుండి ఒక దేశ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అలాగే అహింసా యొక్క ప్రపంచ చిహ్నంగా ఆయన చేసిన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తి దయకాన్ని ఇస్తుంది. అయితే తన విద్యాబ్యాసం తరువాత గాంధీ దక్షిణాఫ్రికా వెళ్లారు. ఇక మొట్టమొదటి సారిగా దక్షిణాఫ్రికా నుండిఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఇక అక్కడ తెల్లవారిపై ఉద్యమాన్ని నాంది పలికారు. ఇక దేశాన్ని ఏకం చేసి తన ప్రసంగాలతో అందరిని ఉసిగొల్పాడు. ఇక దేశాన్ని అంతటినీ ఏకధాటి మీదకు తెచ్చి స్వాతంత్ర్యాన్ని తేవడంలో కీలకంగా ఉన్నారు. దేశంలో కీలక వ్యక్తిగా నిలిచి, జాతిపితగా నిలిచిపోయాడు.

అలాంటి గొప్ప మహాత్ముడు 1948 జనవరి 30న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. అదే రోజు సాయంకాల సమయాన ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా గాంధీని, నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. ఇక తన ప్రాణం వదిలేటప్పుడు ‘హే రామ్’ అంటూ చివరి ప్రాణం వదిలాడు జాతిపిత. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే తనదైన ముద్ర వేసి.. మహోన్నత వ్యక్తిగా నిలిచిపోయాడు. అలాంటి గొప్ప మహాత్ముడి 151వ జయంతి సందర్భంగా ఆయనకు ఇవే ఘన నివాళులు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us