కరోనా కాటుకు మాదాపూర్ ఎస్ ఐ మృతి

Advertisement

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే సామాన్యుల నుండి సినీ, రాజకీయ నాయకుల వరకు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక మరోవైపు ఈ మహమ్మారి పోలీసులను కూడా వదలడం లేదు. తాజాగా ఈ వైరస్ దాటికి హైదరాబాద్ లోని మాదాపూర్ ఏస్ ఐ అబ్బాస్ అలీ కన్నుమూశారు. అయితే చాలా రోజులుగా వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.

ఇటీవల అబ్బాస్‌ అలీ అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చేరాడు. ఇక ఆ సమయంలో అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన పరిస్థితి మరింత విషమించింది. దీనితో ఈ రోజు ఉదయం మరణించాడు. ఇక అబ్బాస్ మృతి పట్ల పోలీస్ శాఖ సంతాపం వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here