పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నటి మాధవి లత

Advertisement

ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన మాధవి లత ఇప్పుడు రాజకీయాల్లో చేరారు. 2019 ఎన్నికల సమయంలో ఆమె బబీజేపీలో చేరారు. ఆమె రాజకీయాల్లో చేరిన తరువాత ఆమె ఇస్తున్న ఇంటర్ వ్యూస్ వల్ల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. ఆమె పార్టీ పరంగా బీజేపీలో ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అయితే ఇప్పుడు మాధవి లత తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తన బర్త్ డే సంధర్బంగా తనకు విషెస్ తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. ఇలా రిప్లై ఇవ్వడంపై మాధవి లత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో మీకు ఓటు వేయామని చెప్పని వారికి, కనీసం మీపై అనవసరపు ఆరోపణలు వచ్చినప్పుడు కూడా నోరు మెదపని వారికి మీరు( పవన్ కళ్యాణ్) ఎందుకు రిప్లై ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు విష్ చేసిన ప్రములందరు మీ క్రేజీ ను వాడుకోవడానికి చూస్తున్నారని, మీకు రిప్లై ఇవ్వాలని అనిపిస్తే జనసేన కోసం పని చేస్తున్న వారికి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పై మాధవి లత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై కొన్ని టీవీ చానెల్స్ డిబేట్స్ కూడా కండక్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here