Manchu Vishnu : ఇచ్చిన హామీలు నెర‌వేరుస్తున్న మంచు విష్ణు.. ప్ర‌శంస‌లు కురిపిస్తున్న అభిమానులు

Manchu Vishnu : మంచు వారి అబ్బాయి విష్ణు సినిమాల్లో దాదాపుగా తండ్రిని అనుకరిస్తూ నటుడిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు. మొన్న జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లోనూ తనదైన బాణీ పలికించారు. అందరినీ కలుపుకుపోతూ ‘మూవీ ఆర్టిస్ట్స్ మంతా ఒక ఫ్యామిలీ’ అనే నినాదంతో ‘మా’ అధ్యక్షునిగా ఘనవిజయం సాధించిన మంచు విష్ణు ఆ మధ్య ప్రతి రోజూ వార్తల్లో నిలిచారు.

TheNewsQube-
Maa president manchu vishnu
Maa president manchu vishnu

హీరోగా అనేక చిత్రాలలో నటించినా, మంచు విష్ణుకు విజయమాధుర్యాన్ని చవిచూపిన చిత్రాలు కొన్నే అని చెప్పవచ్చు. తండ్రి మోహన్ బాబు లాగే మంచు విష్ణు కూడా విద్యావేత్త అనిపించుకున్నారు. ‘స్ప్రింగ్ బోర్డ్ అకాడెమీ’, ‘స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్స్’కు ఛైర్మన్ గా ఉన్నారు విష్ణు.

Maa president manchu vishnu
Maa president manchu vishnu

‘మా’ అధ్య‌క్షుడుగా మంచు విష్ణు కొత్త ప్రయాణం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. గత అధ్యక్షుల కంటే భిన్నంగా వేగంగా వర్క్ చేస్తూ అందర్నీ మెప్పిస్తున్నాడు కూడా. ఎన్నికల వేల విష్ణు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు చూస్తే జనరల్ ఎలక్షన్స్ లో పొలిటీషియన్స్ ని మించిపోయాడు అనిపించింది. కానీ అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు.

ప్రధాన ఎజెండాల్లో ఒక్కటైన సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. అసోసియేషన్‌లోని సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నగరంలోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్ తోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు.

నిరంతరంగా సభ్యులు తమ ఆరోగ్యాన్ని ఈ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షించుకోవచ్చని వెల్లడించారు. అంతేకాకుండా వైద్యనిపుణులతో ముఖాముఖీ మాట్లాడటంతో పాటు వీడియో కన్సల్టెంట్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించారు. అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు.

డిసెంబర్‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. అలాగే టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లోనూ మా సభ్యులకు రాయితీపై రోగ నిర్దారణ పరీక్షలు చేయించనున్నట్లు విష్ణు వెల్లడించారు. ఒకదాని తర్వాత ఒక్కో హామీని నెరవేరుస్తూ కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు అందరి మన్ననలు పొందుతున్నాడు.