MAA Elections: మా ఎన్నికల్లో మరోసారి బయట పడుతున్న వర్గపోరు

MAA Elections మా అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఎంతమంది చెబుతున్న కూడా పరిస్థితులు చూస్తుంటే అలా జరిగేలా కనిపించడం లేదు. ఒకరిని ఒకరు దూషించడం ఏంటి.. ఇది చిల్లర రాజకీయాలు కాదు.. జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు అంతకంటే కాదు.. ఎందుకు అనవసరంగా ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అంటూ చాలా మంది ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపించారు.

మన గురించి మనం తిట్టుకుంటే బయట పోయేది మన పరువు అంటూ ప్రకాష్ రాజ్, బాలకృష్ణ, మంచు విష్ణు, మురళీ మోహన్ లాంటి వాళ్ళు ఇప్పటికే తెలిపారు. అయినా కూడా మా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కొన్ని సంవత్సరాలుగా కోట్లకు కోట్లు కూడపెడుతున్నారు కదా.. అమెరికాకి వెళ్తున్నారు.. అక్కడ కూడా కోట్లు తీసుకొస్తున్నారు..

మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు.. వాటితో మా బిల్డింగ్ కట్టుకోడానికి చేతకావడం లేదా అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యాడు. మరోవైపు మరోవైపు నాగబాబు అసలు ఆగడం లేదు. ఆయన కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై వెంటనే కౌంటర్ ఇచ్చాడు. మా అసోసియేషన్ లెక్కలు అని ఓపెన్ బుక్ లా ఉంటుందని.. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి లెక్కలు చూసుకోవచ్చు అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీనిపై మరికొందరు హీరోలు కూడా మాట్లాడుతున్నారు.

మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వైపు మెగా కుటుంబం ఉంది అని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే బాలకృష్ణతో పాటు మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ హీరోలు మంచు విష్ణు వైపు నిలబడుతున్నారు. ఇదంతా చూస్తుంటే మా ఎన్నికల్లో కచ్చితంగా వర్గపోరు బహిర్గతమవుతుంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలో అంటూ ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దలు చర్చించుకుంటున్నారు. వాళ్లు బయటకు చెప్పకపోయినా కూడా లోలోపల మాత్రం మా ఎన్నికలపై బాగానే చర్చ జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే ప్రశాంతంగా ఎన్నికలు మాత్రం జరిగేలా కనిపించడం లేదు.