విషాదం: లవ్ యూ జిందగీ యువతి మృతి.. చనిపోవడానికి ముందు తను తీసిన వీడియో ఇదే

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో దేశమంతా అల్లాడుతోంది. ఎక్కడ చూసినా కరోనా సోకిన వాళ్లే. దేశంలోని ఏ ఆసుపత్రిలో చూసినా కరోనా పేషెంట్లే. రోజూ వేల సంఖ్యలో కరోనా సోకిన వాళ్లు చనిపోతున్నారు. కరోనా సోకిన వాళ్లలో ఎక్కువగా చనిపోయేది ఆక్సిజన్ అందక లేదా సరైన సమయానికి ట్రీట్ మెంట్ అందక.. లేదా ఇతర వ్యాధుల వల్ల చనిపోతున్నవాళ్లు ఎక్కువగా ఉన్నారు. చాలామంది అయితే ఆక్సిజన్ అందక పిట్టల్లా రాలిపోతున్నారు.

love you zindagi girl died after her video
love you zindagi girl died after her video

ఆక్సిజన్ కొరత లేకుండా ఇప్పుడిప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఏది ఏమైనా.. కరోనా సెకండ్ వేవ్ మాత్రం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా యువతను సెకండ్ వేవ్ పట్టి పీడిస్తోంది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్లు కూడా కరోనా రావడంతో చనిపోతున్నారు. న్యూఢిల్లీకి చెందిన 30 ఏళ్ల ఓ యువతి కూడా కరోనా కాటుకు బలి అయింది.

తను ఓ డాక్టర్. తన  పేరు మోనిక. అయితే.. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తుండగా తనకు కూడా కరోనా సోకింది. దీంతో తనకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. తను డాక్టర్ అయినప్పటికీ ఢిల్లీలో బెడ్స్ కొరత వల్ల తనకు ఐసీయూ బెడ్ దొరకలేదు. దీంతో కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో గత 10 రోజుల నుంచి తను ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. తనకు ఎన్ఐవీ సపోర్ట్ ఇచ్చారని.. రెమెడెస్ విర్ ఇంజక్షన్ ఇచ్చారని.. ప్లాస్మా థెరపీ కూడా చేశారట. తను ఎంతో ఆరోగ్యవంతమైన యువతి అట. అయినా కూడా తను కరోనాతో పోరాడి ఓడిపోయింది. తను చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు మరో డాక్టర్ తో మ్యూజిక్ పెట్టించుకొని లవ్ యూ జిందగీ అనే పాటకు బెడ్ మీద కూర్చొనే డ్యాన్స్ వేసింది. ఆ వీడియో ఇటీవల కాలంలో విపరీతంగా వైరల్ అయింది. ఏది ఏమైనా జీవితం మీద నమ్మకం కోల్పోవద్దు అనే విషయాన్ని ఆ యువతి చెప్పినట్టుగా ఆ వీడియోలో కొట్టొచ్చినట్టు కనిపించినా చివరకు తను కూడా కరోనాకు బలయిపోయింది.