Love : వైరల్‌ : మానసిక వికలాంగుల మనసులు కలిశాయి.. పెళ్లి చేసుకున్నారు

NQ Staff - November 11, 2022 / 12:12 PM IST

Love : వైరల్‌ : మానసిక వికలాంగుల మనసులు కలిశాయి.. పెళ్లి చేసుకున్నారు

Love : వారిద్దరు కూడా మానసిక వికలాంగులు.. పిచ్చివారు అంటూ సమాజంతో ముద్ర వేయించుకొని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ లో గత కొన్నాళ్లుగా మానసిక వికలాంగులుగా చికిత్స పొందుతున్నారు.

అతడి వయసు 42 ఆమె వయసు 38 సంవత్సరాలు.. వారే మహేంద్ర, దీప. వీరిద్దరి కుటుంబాల వారు కూడా వీరు మానసిక వికలాంగులు అవడంతో పిచ్చి ఆసుపత్రిలో వదిలేసి వెళ్లి పోయారు. మహేంద్ర మరియు దీప ఇప్పుడు పూర్తిగా నార్మల్ అయ్యారు.

కానీ బయటకు వెళ్తే ఇంకా కూడా పిచ్చి వాళ్ల మాదిరిగానే వీరిద్దరిని చూడడం మొదలు పెట్టారు. జనాలు ఎంత చెప్పినా కూడా వీరిని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు, ఏదోలా మహేంద్ర డే కేర్ సెంటర్ లో పని చేస్తూ.. దీప క్యాంటీన్ లో పని చేస్తూ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.

ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది, మానసిక స్వస్థత సాధించిన వీరిద్దరూ మనసులు కలవడంతో హాస్పిటల్ డాక్టర్స్ పెళ్లి పెద్దలుగా ముందుండి వారి వివాహం చేశారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడు హెల్త్ మినిస్టర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. మానసికంగా దెబ్బతిని సుదీర్ఘకాలంగా వీరిద్దరూ మెంటల్ హాస్పిటల్ లో ఉంటూ వచ్చారు. ఇప్పుడు సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కొత్త జంట జీవితం కలకాలం సంతోషంగా సాగాలని ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us