Lord Ganesh: ముస్లీం దేశం కరెన్సీ నోటు పై వినాయకుడి బొమ్మ ఉండడానికి కారణం ఏంటి..!!

Admin - April 22, 2021 / 12:01 PM IST

Lord Ganesh: ముస్లీం దేశం కరెన్సీ నోటు పై వినాయకుడి బొమ్మ ఉండడానికి కారణం ఏంటి..!!

Lord Ganesh( ముస్లీం దేశం కరెన్సీ ): భారతదేశంలోని హిందువులు ఎంతో ఆరాధ్యంగా కొలిచే దేవుడు వినాయకుడు.. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ రకాల దేశాల్లోని హిందువులు కూడా వినాయకుని ఆరాధిస్తారు.. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు వినాయకుడిని ఆరాధనచేయమని చెప్తారు.. ఎందుకంటే ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని.. అలాంటి విగ్నేశ్వరుడు ముస్లిందేశమైన ఇండోనేషియా దేశం యొక్క కరెన్సీ పై ముద్రించబడి ఉంటాడు..ఇండియన్స్ ఎక్కువగా ఉంటే ఇండోనేషియాలో ఈ విధంగా వినాయకుడి బొమ్మ ఉండడానికి గల కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం..

lord Ganesh idol on Muslim country currency : ముస్లీం దేశం కరెన్సీ

lord Ganesh idol on Muslim country currency

ఈ విధంగా ఉండటానికి రెండు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.. ఇండోనేసియా డచ్ వారు పరిపాలించిన రోజుల్లో హజర్ దేవంతర అనే వ్యక్తి స్వతంత్రం కోసం పోరాటం చేసే వాడు.. అయితే వినాయకుడు చదువును, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడని ఆయన తెలియడంతో విద్యార్థులు వినాయకుడిని చూస్తే చదువులో తెలుస్తుందని తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని భావించాడు.. ఈ గ్రామంలో వినాయకుడి బొమ్మ ను ఆ నోటు పై ముద్రించడం మొదలుపెట్టారు..

మరో కారణం ఏంటంటే 1997లో ఆసియా దేశాల కరెన్సీ విలువ అంతర్జాతీయ మార్కెట్లో బాగా తగ్గింది.. దీనితో వినాయకుడి బొమ్మ ను ముద్రిస్తే మంచి జరుగుతుందని భావించిన ఆ దేశం నేతలు అలాగే చేశారు. ఈ క్రమంలో ఇండోనేషియా కరెన్సీ లో పెరిగింది.. అందుకనే ఆ తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆ నోట్ల పై వినాయకుడి బొమ్మ ముద్రిస్తూ వచ్చారు.. కానీ ఇప్పుడు లభిస్తున్న కొత్త నోటు పై వినాయకుడి బొమ్మ లు లేవు.. తాజాగా వినాయకుడి బొమ్మ సంబంధించిన కరెన్సీ నోట్లను షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us