Nara Lokesh : ఓటమి భయంతోనే నారా లోకేశ్ ఇలా చేస్తున్నారా?

Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేశ్ దూకుడు మీదున్నారు. ఓవైపు తిరుపతి ఉపఎన్నికలు జరుగుతుండగా… మరోవైపు ట్విట్టర్ లో ట్వీట్లతో లోకేశ్ బాబు దూసుకుపోతున్నారు. వైఎస్సార్సీపీ కావాలని పేదవాళ్లను ఎక్కడి నుంచో తీసుకొచ్చి… వలస వెళ్లిన వాళ్ల పేర్ల మీద దొంగ ఓట్లు వేయిస్తోందని ఆరోపించారు. దానికి సంబంధించిన వీడియోలను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు లోకేశ్. ఓవైపు ఎన్నికలు జరుగుతుండగానే… అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది.

lokesh alleges of fake votes in tirupati byelection
lokesh alleges of fake votes in tirupati byelection

బీజేపీ కూడా అధికార పార్టీపై నిప్పులు చెరుగుతోంది. ఓవైపు పెద్దిరెడ్డి పుంగనూరు వీరప్పన్ అంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఎర్రచందనం చెట్లను ఎలా నరికేస్తున్నారో… అలాగే ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేస్తున్నారు. దైవదర్శనానికి అని చెబుతూ… వేలాది మందిని బస్సుల్లో తరలిస్తూ… దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే.. రెడ్ హాండెడ్ గా దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన కొందరు ఓటర్లను టీడీపీ నేతలు, ఇతర నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించాలని నారా లోకేశ్ కోరారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వేలాది మందిని అరెస్ట్ చేసి వెంటనే అసలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అలాగే… టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి దొంగ నోట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఇలాంటి అడ్డదారులను తొక్కుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Advertisement