హైదరాబాద్ లో మరల మొదలు కానున్న లాక్ డౌన్

Advertisement

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా హైదరాబాద్ లో మరల లాక్ డౌన్ విధించాలన్న నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కెసిఆర్. కరోనా లాక్ డౌన్ తో దేశ్ పూర్తి ఆర్థిక స్థితి దెబ్బతింది. దానితో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని తొలగించడం జరిగింది. అయితే ఆలా లాక్ డౌన్ తొలగించడం వలన చాలా రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఒక్క సారిగా విపరీతంగా పెరిగిపోయాయి.

తెలంగాణ లో అయితే ఏకంగా రోజుకు 1000 కేసులకు పైగా నమోదు అయ్యే పరిస్థితి ఏర్పడింది. దానిలో 80 శాతానికి పైగా కేసులు కేవలం ఒక్క GHMCనుండి మాత్రమే నమోదు ఆవుతున్నాయి. అందువలన హైదరాబాద్ లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం కాస్త తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి కి చేరడం తో ఆయన ఏర్పరిచిన మీటింగ్ లో కరోనా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి. ఎంత మందికి వైద్యం అందించే సదుపాయాలు మనం కలిగి ఉన్నాము.

అలాగే ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు పూర్తయ్యాయి అని మొదలగు అంశాల గురించి చర్చిస్తూనే తాను తీసుకోబోతున్న ఒక సంచలనమైన నిర్ణయాన్ని బయట పెట్టాడు. అయితే పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా తాను హైదరాబాద్ లో 15 రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలియ చేసాడు. అయితే ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో కేసులు మరీ ఎక్కువ ఉండడం తో స్వచ్చంధ లాక్ డౌన్ ని ఆయా ఏరియా ల వరకు ప్రకటించుకోవడం జరిగింది. ఇంకా కెసిఆర్ కి కూడా చాలా కొంతమంది నిపుణులు మరియు వైద్యులు హైదరాబాద్ లో పెరుగుతున్న కేసులు మరల తగ్గుముఖం పట్టేలా చేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం అంటూ సూచించడం తో ఈ నిర్ణయం తీసుకొని త్వరలోనే అమలు పరచాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలియ చేసాడు.

కానీ మరల GHMC మొత్తం పూర్తి లాక్ డౌన్ ప్రకటించడం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో కొంచెం కష్టమైన పని కావడం, పైగా దాని కోసం పోలీస్ లను మరల లాక్ డౌన్ ఏరియా ల వరకు బదిలీ చేయడం, వారికి ప్రత్యేక డ్యూటీ లు వేయడం, అందరి అధికారులతో మాట్లాడి వారి అంగీకార పొందాల్సి ఉండడం. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉండడం తో దీని పైన చర్చలు జరిపిన పిదప త్వరలోనే లాక్ డౌన్ గురించిన అధికార ప్రకటన తెలియచేస్తానని చెప్పాడు. మరి ఏ లాక్ డౌన్ 6 ఎంత త్వరలో అమలు చేస్తే అంత మంచిది అని వైద్యులు తెలుపుతున్న సూచన మేరకు ఈ 15 రోజుల పాటు విధించబోయే లాక్ డౌన్ 6 ని ఎప్పుడు అమలు చేయబోతున్నాడు అని హైదరాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ లాక్ డౌన్ వలన అయిన GHMC లో పెరుగుతున్న కరోనా కేసులకు పుల్స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here