China : అన్లాక్ చైనా.. ఆందోళనలు ఉదృతం
NQ Staff - November 27, 2022 / 03:23 PM IST

China : కరోనా ఫ్రీ దేశంగా చైనా ను మార్చాలనే ఉద్దేశం తో అక్కడ అత్యంత కఠినమైన ఆంక్షలను ప్రభుత్వం అమలు చేస్తోంది. దాంతో రోజు వారి కూలీ పనులు చేసుకునేది మొదలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న కారణంగా కఠిన ఆంక్షలు మరియు లాక్ డౌన్ కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా చైనా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అనధికారికంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు మరియు లాక్ డౌన్ కి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇతర దేశాల్లో లేని లాక్ డౌన్ మరియు కఠిన ఆంక్షలు చైనాలోనే ఎందుకు అంటూ వారు తీవ్రంగా ప్రతిఘటిస్తూ దేశ అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి, కానీ చైనాలో మాత్రమే కఠిన ఆంక్షలు అమలవుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అందుకే అక్కడ ప్రజలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.