Bigg Boss 5 Telugu: లోబో ఈజ్ బ్యాక్.. త్రిమూర్తుల మ‌ధ్య ముదురుతున్న విభేదాలు

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్రమం రోజురోజుకు మ‌రింత ఆలోబోస‌క్తిక‌రంగా సాగుతుంది.ఎప్పుడు ఎవ‌రు ఎలా ఉంటారో ఎవ‌రికి అర్ధం కాని విధంగా మారింది. ఊహించని షాక్‌లకు కేరాఫ్‌ అయిన బిగ్‌బాస్‌లో తాజాగా గురువారం కంటెస్టెంట్‌లకు బిగ్‌బాస్‌ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. లోబో ఎలిమినేట్‌ అవ్వలేదని షో చూస్తున్న ప్రేక్షకులకు తెలిసినప్పటికీ.. హౌజ్‌మెట్స్‌కి మాత్రం తెలీదు.

ఇన్ని రోజులు సీక్రెట్ రూంలో ఉన్న లోబో తిరిగి బిగ్ బాస్‌లోకి వ‌చ్చాడు. ప్రోమో ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. లోబో లోప‌ల‌కి రావ‌డంతో హౌజ్‌మేట్స్ అంద‌రు సంతోషం వ్య‌క్తం చేశారు. రవి పరిగెత్తుకుంటూ వెళ్లి లోబోను గట్టిగా హత్తుకున్నాడు. దాదాపు అంద‌రి క‌ళ్ల‌ల్లో లోబో వ‌చ్చిన ఆనందం క‌నిపించింది.

ఇక బిగ్‌బాస్‌ పెట్టిన సీక్రెట్ టాస్క్‌ చిచ్చు.. షణ్ముఖ్‌, సిరి, జెస్సీల మధ్య గొడవకు దారి తీసినట్లు కనిపిస్తోంది. అందరూ టాస్క్‌ సరిగ్గా ఆడడని అంటున్నారని, తనను అందరూ పిచ్చ లైట్‌ తీసుకుంటున్నారని జెస్సీ, సిరిల ముందు షణ్ముఖ్‌ వాపోయాడు.ఇక జెస్సీ కెప్టెన్‌ కావాలనుకున్నాడని, దానికి సిరి సహాయం చేసిందని దాంతో తాను ఎదవను అయ్యానని కంటతడి పెట్టుకున్నాడు ష‌ణ్ముఖ్‌.

ష‌ణ్ముఖ్‌కి స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం సిరీ, జెస్సీ చేసిన కూడా ఫ‌లించ‌లేదు.సిరిని అక్కడి నుంచి వెళ్లిపో అంటూ అరిచాడు ష‌ణ్ముఖ్. దీంతో సిరి కూడా ఏడ్చేసింది. ఇంతకీ వీరి ముగ్గురు మధ్య అసలేం జరిగింది.? ఇదంతా బిగ్‌బాస్‌ పెట్టిన చిచ్చు ఫలితమేనా అని అంద‌రు ఆలోచించుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌజ్‌కి త్రిమూర్తులులా ఉన్న ష‌ణ్ముఖ్, సిరి, జెస్సీ విడిపోతే ఆట‌లో ప‌స త‌గ్గుత‌ద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి కొంద‌రు ఇప్పుడు అస‌లు ఆట ప్రారంభం అని కామెంట్స్ పెడుతున్నారు.