Heroines : అనుష్క నుంచి శృతిహాసన్ దాకా.. వేశ్యలుగా నటించిన హీరోయిన్లు వీరే..!
NQ Staff - November 13, 2023 / 02:11 PM IST

Heroines :
తెరమీద హీరోయిన్ పాత్రలు ఎవరైనా చేస్తారు. కానీ కొన్ని పాత్రలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. సమాజం నుంచి, అభిమానుల నుంచి వచ్చే ఎలాంటి విమర్శలు రాకుండా.. వాటిని తమ నటనతో కవర్ చేసేంత ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యంతోనే వేశ్య పాత్రలను చాలామంది పోషించారు తెర మీద. ఇంకో విషయం ఏంటంటే.. వారు హీరోయిన్ల పాత్రల్లో ఎంతగా ఒదిగిపోయారో.. ఒక వేశ్య పాత్రలో కూడా అంతే స్థాయిలో ఒదిగిపోయి నటించారు. అనుష్కశెట్టి నుంచి మొదలు పెడితే.. శృతిహాసన్ దాకా చాలామంది ఇలాంటి వేశ్య పాత్రల్లో నటించి మెప్పించారు.
అనసూయ..
ఇందులో చూసుకుంటే యాంకర్ గా చాలా ఫేమస్ అయిన అనసూయ.. వెండితెరపై విలన్ పాత్రల్లో కూడా నటిస్తోంది. ఇప్పటికే పుష్ప సినిమాలో పవర్ ఫుల్ రోల్ పోషించింది. ఇక తాజాగా విమానం పాత్రలో వేశ్య పాత్రలో నటించింది. ఇందులో వెయ్యి ఇస్తే ఎవడైనా ఓకే అంటూ బోల్డ్ గా నటించి మెప్పించింది.
అనుష్కశెట్టి..
అనుష్క హీరోయిన్ గా ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో సరోజ పాత్రలో అలరించింది. ఇది చాలా బోల్డ్ పాత్ర. పైగా చాలా వల్గర్ గా కూడా ఉంటుంది. అయినా సరే ఇందులో ప్రొఫెషనల్ వేశ్యగా నటించింది.
టబు..
సీనియర్ నటి టబు హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే ఆమె కూడా వేశ్యగా చేసింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పాండురంగడు సినిమాలో బాలయ్య హీరోగా చేశాడు. ఇందులో ఆమె శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించింది. ఆమె వేశ్య పాత్ర ఎంతో బోల్డ్ గా ఉంటుంది.
చార్మీ..
హీరోయిన్ గా చార్మీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాలో వేశ్యగా నటించింది. సినిమా మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీలో ఛార్మి కెరీర్లో ఫస్ట్ వేశ్యగా కనిపించి అలరించారు.
శృతిహాసన్..
శృతిహాసన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్. ఇంత కెరీర్ ఉన్న ఆమె వేశ్యగా నటించడం అంటే మెచ్చుకోదగ్గ విషయమే. అయితే ఆమె హిందీలో చేసిన ‘డి డే’లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చారు. మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ని ఉద్దేశించి తెరకెక్కిన డి డే మూవీలో శృతి హాసన్ పాకిస్తాన్ కి చెందిన వేశ్యగా నటించారు. ఇంకా చాలామందిఇలా నటించారు. సీనియర్ హీరోయిన్లు శ్రియా శరణ్, సంగీత, రమ్యకృష్ణ లాంటి వారు కూడా వేశ్యలుగా నటించారు.