Telangana : డిప్యూటీ సీఎంలుగా ఆ ముగ్గురు.. సామాజిక వర్గాల ఆధారంగా పదవులు..!

NQ Staff - December 6, 2023 / 12:13 PM IST

Telangana : డిప్యూటీ సీఎంలుగా ఆ ముగ్గురు.. సామాజిక వర్గాల ఆధారంగా పదవులు..!

Telangana :

తెలంగాణలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారు. మొదట ఆయన్ను కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. దాంతో మొన్న సోమవారమే సీఎం అభ్యర్థిత్వంపై ప్రకటన రావాల్సి ఉన్నా ఆగిపోయింది. దాంతో మరో సారి భేటీ అయిన అధిష్టానం చివరకు రేవంత్ రెడ్డికే పదవి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే అధిష్టానం నిర్ణయం తర్వాత చేసేది లేక సీనియర్లు కూడా గమ్మునుండి పోయారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నారు కాబట్టి.. సీనియర్లకు కీలక పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాగా ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కానీ మల్లు భట్టి విక్రమార్క మాత్రం ఇస్తే గిస్తే తనకు ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ సమాజికవర్గాల ఆధారంగా డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందడుగు వేస్తోంది. అందులో ఎలాగూ సీఎం పదవి ఆశించి భంగపడ్డారు కాబట్టి.. మల్లు భట్టి విక్రమార్కకు సీఎం పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్నయించారు. ఆయనకు దళిత సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక బీసీ సామాజికవర్గం నుంచి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం కాబోతున్నారని తెలుస్తోంది. ఆయన గతంలో ఎంపీగా పని చేశారు. కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ గా ఆయనకు పేరుంది. అందుకే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు. ఇక తర్వాత ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి ఇవ్వాలని అనుకుంటున్నారు. అందులో చూసుకుంటే సీతక్కకు ఇవ్వబోతున్నారంట. సీతక్కకు రేవంత్ చెల్లెలిగా పేరుంది. పైగా రేవంత్ అడుగు జాడల్లో నడుస్తూ ఆయనకు తోడుగా నిలుస్తోంది సీతక్క.

రేవంత్ తో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చింది. కాంగ్రెస్ లో కూడా రేవంత్ బాటలోనే నడిచింది. ఆయనకు టీపీసీసీ పదవి రావడంలో కూడా కీలక పాత్ర పోషించింది. రేవంత్ చేసిన పాదయాత్రలో అడుగులు వేసింది సీతక్క. అంతే కాకుండా ప్రతి పనిలో కూడా రేవంత్ కు అండగా నిలిచింది.

అందుకే పట్టుబట్టి మరీ ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. పైగా సీతక్కకు బలమైన శాఖను ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇక సీనియర్లు అయిన కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us