Star Heroines : స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేసిన క్రికెటర్స్.. ఎవరో తెలుసా?
NQ Staff - November 21, 2023 / 10:11 AM IST

Star Heroines :
క్రికెటర్స్ కు సినీ సెలెబ్రిటీలు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది అనేది సాధారణ ప్రజలకు సైతం తెలుసు.. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు.. ఎన్నో ఏళ్లుగా ఈ ట్రెండ్ నడుస్తుంది. క్రికెట్ లో స్టార్ క్రికెటర్ అయితే చాలు స్టార్ హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపించడం ఖాయం.. ఈ లిస్టులో చాలా మంది ఉండగా వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మహేంద్ర సింగ్ ధోనీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈయన ఖాతాలో అయితే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారనే చెప్పాలి. ముఖ్యంగా బయటకు వినిపించిన పేర్లు ఏంటంటే దీపికా పదుకొనె, రాయ్ లక్ష్మి.. ఒకానొక సమయంలో ధోనీ ఈ ఇద్దరితో ఎఫైర్ నడిపించినట్టు టాక్ వచ్చింది.
2. ఇక స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు.. ఇతడు క్రికెట్ లో మన్మథుడిగా పేరు తెచ్చుకున్నాడు.. యువరాజ్ ఎఫైర్స్ లిస్టు చెప్పాలంటే చాలానే ఉంది.. కానీ ముఖ్యముగా చెప్పాల్సిన పేర్లు.. దీపికా పదుకొనె, నేహా ధూపియా, కిమ్ శర్మ, ప్రీతీ జింటా వంటి వారితో ఎఫైర్ నడిపించారు.
3. క్రికెటర్ గంగూలీ హీరోయిన్ నగ్మాతో అప్పట్లో చాలా కాలం పాటు ఎఫైర్ నడిపించినట్టు వార్తలు వచ్చాయి..
4. విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో డేటింగ్ చేసాడు. అయితే వీరి డేటింగ్ పెళ్లి వరకు వెళ్ళింది.. అయితే అనుష్క కంటే ముందు ఇతడు ఇజబెల్లా లైట్ అనే హీరోయిన్ తో డేటింగ్ చేసాడు.
5. యంగ్ అండ్ సెన్సేషన్ కెఎల్ రాహుల్ నిధి అగర్వాల్ తో ఎఫైర్ నడిపినట్టు టాక్ రాగా ఆ తర్వాత సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

List Of Cricketers Dated Star Heroines
6. రోహిత్ శర్మ సోఫియా హయత్ తో డేటింగ్ చేసి ఆ తర్వాత రితిక సజ్జేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..
7. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒకప్పుడు హీరోయిన్ గీతా బస్త్రా తో డేటింగ్ చేసాడు.. ఈమెను 2016లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
8. యంగ్ అండ్ డాషింగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో డేటింగ్ చేసినట్టు రూమర్స్ వచ్చాయి.. అయితే ఇతడు ప్రజెంట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో డేటింగ్ చేస్తున్నట్టు టాక్..
9. హార్దిక్ పాండ్య సెర్బియన్ నటి నటాషాతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నాడు.