Ananya Panday : విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ చిత్రంలో కథానాయికగా నటించిన అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు చుంకీ పాండే కూతురిగా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అక్కడ తనదైన శైలిలో అలరిస్తూ వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది. త్వరలో లైగర్ చిత్రంతో ప్రేక్షకులకి పసందైన వినోదం పంచనుంది.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ.

సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బోల్డ్ గా అనన్య పాండే ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఒంపు సొంపులతో అనన్య పాండే హాట్ కేకులా కుర్రాళ్లని ఊరిస్తోంది. కిల్లింగ్ లుక్స్ తో అనన్య లేడి బాస్ తరహాలో ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
- Advertisement -

తాజాగా అనన్య పాండే టెంప్టింగ్ లుక్స్‌లో కనిపిస్తూ మతులు పోగొడుతుంది. కేక పెట్టించే అందాలకు కుర్రకారు దాసోహం అవుతున్నారు. ప్రస్తుతం నెట్టింట అనన్య పిక్స్ తెగ హల్చల్ చేస్తుండగా, వాటికి నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పిక్స్ వైరల్‌గా మారాయి.
ఇటీవల ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, రొమాంటిక్ డ్రామా గెహ్రైయాన్ తో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకుణె, సిద్దాంత్ చతుర్వేదితో కలిసి నటించింది అనన్య. ఈ చిత్రంలో కొన్ని బోల్డ్ సీన్లలోనూ నటించి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. అంతే కాకుండా ఆ చిత్ర ప్రమోషన్స్ కు కూడా చాలా బోల్డ్ గా ఫొటోషూట్ నిర్వహించింది. బికినీల్లో దీపికా పదుకునే, అనన్య పాండే వరుస ఫొటోషూట్లు చేసి ఆ మధ్య సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే