Lavanya Tripathi : ఆ స్టార్ హీరోతో లిప్ లాక్ అంటే భయపడి సినిమా వదిలేసిన లావణ్య త్రిపాఠి..!
NQ Staff - June 20, 2023 / 12:00 PM IST

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి పేరు ఈ నడుమ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. చాలా కాలంగా వస్తున్న రూమర్లను మొన్ననే నిజం చేసేశారు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ ఇన్ని రోజులు బయట పెట్టలేదు. కానీ మొన్న సడెన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని అందరికీ ట్విస్ట్ ఇచ్చారు వీరిద్దరూ.
మరికొన్ని నెలల్లోనే వీరి పెళ్లి జరగబోతోంది. ఇదిలా ఉండగా.. గతంలో లావణ్య త్రిపాఠి ఓ స్టార్ హీరో సినిమాను వదిలేసుకుంది. ఆ సినిమా చేసి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. ఆ సినిమా ఏదో కాదు గీతా గోవిందం. నిజానికి గీతా గోవిందం సినిమాకు ముందుగా నన్నే అడిగారు.
కానీ విజయ్ దేవరకొండ హీరో అనేసరికి ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమా చూశాక.. ఆయనతో సినిమా అంటే లిప్ లాక్ లు ఎక్కువగా ఉంటాయేమో అని భయపడ్డాను. అందుకే ఆ సినిమాను వదులుకున్నాను. నా తర్వాత రష్మిక వచ్చి నటించింది. ఆ సినిమాతోనే ఆమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Lavanya Tripathi Rejected Geetha Govindam Movie
ఒక వేళ నేను చేసి ఉంటే ఇప్పుడు రష్మిక లాగా పాన్ ఇండియా హీరోయిన్ గా ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది లావణ్య. అంటే లిప్ లాక్ లు అనవసరంగా భయపడ్డాను అని ఆమె ఇన్ డైరెక్టుగా చెబుతోందన్నమాట. ఏదేమైనా ఆమె ఇప్పటి వరకు ఇలాంటి లిప్ లాక్ సీన్లలో అయితే నటించలేదు. అందుకే మెగా కోడలు అయిందేమో అంటున్నారు నెటిజన్లు.