Lavanya Tripathi : ఆ హీరో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా.. వరుణ్ కు షాక్ ఇచ్చిన లావణ్య..!
NQ Staff - June 13, 2023 / 02:13 PM IST

Lavanya Tripathi : మొన్ననే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇరువురి ఫ్యామిలీల నడుమ రింగ్ లు మార్చుకున్నారు. అప్పటి నుంచి మెగా కోడలు లావణ్య గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఎక్కడో నార్త్ నుంచి వచ్చి మెగా కోడలు కావడం అంటే ఆమెది మామూలు లక్ కాదని అంటున్నారు.
అయితే లావణ్య గతంలో తన మనసులోని మాటలను బయట పెట్టిన కొన్ని ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. గతంలో లావణ్య దూసుకెళ్తా సినిమాలో నటించింది. ఆ సినిమా సమయంలో ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ లో పాల్గొంది.
ఇందులో మీకు ఏ హీరో భర్తగా రావాలని కోరుకుంటున్నారు అని అడగ్గా.. హృతిక్ రోషన్ పేరు చెప్పేసింది. నేను హృతిక్ రోషన్ కు చాలా పెద్ద ఫ్యాన్. అతనితో నటించాలని ఆశగా ఎదురు చూస్తున్నా. అతను ఒప్పుకుంటే పెళ్లికి కూడా నేనే రెడీ అంటూ అప్పట్లో సరదాగా చెప్పింది. ఇంకేముంది ఆ వీడియోను తీసుకు వచ్చి కొందరు సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కు ట్రోల్స్ చేస్తున్నారు.

Lavanya Tripathi Participated Rapid Fire
హృతిక్ రోషన్ ను ఇష్టపడి మా అన్నను పెళ్లి చేసుకుంటున్నావా అంటూ కొందరు సడెన్ గా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో.. లావణ్యకు హృతిక్ దొరకలేదు కాబట్టే అతనిలాంటి ఫిజిక్ ఉన్న వరుణ్ ను చేసుకుంటోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా వరుణ్-లావణ్య చాలా అందమైన జంట అని అంతా అంటున్నారు.