Lavanya Tripathi : వరుణ్ తేజ్ చాలా మంచి భర్తగా ఉంటాడు.. లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్లు..!
NQ Staff - June 11, 2023 / 10:00 AM IST

Lavanya Tripathi : ఇప్పుడు వరుసగా సెలబ్రిటీలు పెండ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా వరుణ్ తేజ్ కూడా తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఈ జంట త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక మెగా కోడలు కాబోతున్ లావణ్య గురించి అంతా ఆరా తీస్తున్నారు.
ఆమె వ్యక్తిగత విషయాలు, ఆస్తులు, కుటుంబ వివరాలు ఇలా అన్నింటినీ వెతికి బయటకు తీస్తున్నారు. అదే సమయంలో వరుణ్ తో ఆమెకు గతంలో ఉన్న అనుబంధం ఇవన్నీ బయటకు లాగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఓల్డ్ వీడియో ఒకటి బయట పడింది. ఇందులో వరుణ్ తో తన బంధం గురించే అప్పుడే హింట్ ఇచ్చేసింది లావణ్య.
ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది లావణ్య. మీకు హస్బెండ్ మెటీరియల్ అంటే ఎవరు అని యాంకర్ అడగ్గా.. ఏ మాత్రం ఆలోచించకుండా వరుణ్ తేజ్ పేరు చెప్పేసింది లావణ్య. తేజ్ చాలా బెటర్ హస్బెండ్ అవుతాడని తెలిపింది. కానీ అప్పుడు తమ రిలేషన్ ను బయట పెట్టలేదు.
కానీ చూస్తుంటే అప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అర్థం అవుతోంది. అప్పటికే వరుణ్ ను తన భర్తగా ఊహించేసుకుంది ఈ భామ. తాజాగా ఆ వీడియో వైరల్ అవుతోంది. మరి లావణ్య కోరుకున్నట్టు వరుణ్ బెటర్ హస్బెండ్ అవుతాడా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది.