Varun Tej And Lavanya Tripathi : అఫీషియల్.. జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్య ఎంగేజ్ మెంట్ ఫిక్స్..!
NQ Staff - June 8, 2023 / 10:50 AM IST

Varun Tej And Lavanya Tripathi : రూమర్లు నిజం అయ్యాయి. ఇన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలన్నీ వాస్తవ రూపం దాల్చాయి. ఇంతకీ ఎవరి గురించా అనుకుంటున్నారా.. మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠి గురించి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెండ్లి చేసుకుంటారంటూ టాలీవుడ్ మొత్తం టాక్ నడుస్తోంది.
కానీ ఈ వార్తలపై ఇప్పటి వరకు అటు లావణ్య గానీ, ఇటు మెగా ఫ్యామిలీ గానీ స్పందించలేదు. కానీ కొన్ని రోజలుగా మాత్రం జూన్ 9న ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను తాజాగా మెగా ఫ్యామిలీ కన్ఫర్మ్ చేసింది. వరుణ్ తేజతో లావణ్య ఎంగేజ్ మెంట్ జూన్ 9న నిర్వహించబోతున్నట్టు తెలిపింది.

Lavanya Tripathi Engagement With Varun Tej Be Held On June 9
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇరువురి కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్ అవుతోంది. దాంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు లావణ్యకు అభిమానుల నుంచి విషెస్ భారీ ఎత్తున వస్తున్నాయి వీరిద్దరూ క్యూట్ కపుల్ గా ఉంటారని అంతా చెబుతున్నారు.
రేపు వీరిద్దరి ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోనే ఉంటుందని తెలుస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు, అటు లావణ్య కుటుంబీకులు వస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లావణ్య కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.