Lavanya Tripathi : వరుణ్ కాదు.. ఆ మెగా హీరోపై మనసు పడ్డ లావణ్య.. ఇలా అనిందేంటి..?
NQ Staff - June 12, 2023 / 12:53 PM IST

Lavanya Tripathi : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ మొన్న వైభవంగా జరిగింది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ సైలెంట్ గా ఉంటూనే.. ఇప్పుడు సడెన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని ట్విస్ట్ ఇచ్చారు. మరి కొన్ని నెలల్లో వీరి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటలీ లేదా రాజస్థాన్ లోని ఉదయ్ గఢ్ ప్యాలెస్ లో వీరి పెళ్లి ఉండే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే ఈ కొత్త జంటకు సంబంధించి అనేక విషయాలను బయట పెడుతున్నారు వీరి అభిమానులు. గతంలో లావణ్య ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో మీకు హస్బెండ్ మెటీరియల్ కేటగిరీని తెలుగు హీరోల్లో ఎవరికి ఇస్తారు అని యాంకర్ ప్రశ్నించింది.

Lavanya Tripathi Comments An Interview Are Going Viral
ఏ మాత్రం ఆలోచించకుండా టక్కున సాయిధరమ్ తేజ్ పేరు చెప్పేసింది లావణ్య. సాయితేజ్ మంచి హస్బెండ్ మెటీరియల్ అని వివరించింది ఈ బ్యూటీ. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అదేంటి సాయిధరమ్ తేజ్ పేరు చెప్పి.. వరుణ్ తేజ్ ను పెండ్లి చేసుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
మరికొందరేమో.. అది కేవలం ఆమె ఒపీనియన్ మాత్రమే. కానీ ఆమె మనసులో ఉన్నది వరుణ్ తేజ్ అంటూ చెబుతున్నారు. వరుణ్ తో లావణ్యది స్వచ్ఛమైన ప్రేమ అంటూ చెబుతున్నారు.