దిగజారిన చైనా.. అమ్మాయిలే ఆయుధంగా

Advertisement

చైనా ప్రస్తుతం అన్ని దేశాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. దానికోసం అన్ని రకాల దారులని ఎంచుకుంటుంది. అయితే వాటిలో కొన్ని తప్పుడు దారులను కూడా ఎంచుకుంటుంది. దానిలో భాగంగానే అమ్మాయి లను కూడా ఎర గా వేసి పక్క దేశాల రహస్యాలను తెలుసుకొనే విధంగా చైనా దిగ జారడం జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే చైనా ఇప్పుడు ఆర్థికంగా రెండవ స్థాయిలో ఉందన్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే మొదటి స్థానానికి చేరుకొని వేరే దేశాల పైన ఆధిక్యత పొందడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది. కాగా ఈ మధ్యే అమెరికా, బ్రిటన్ దేశాలు చైనా కి సంబంధించిన వివిధ అంశాల పై విచారణ చేయాలి అనుకుని నిర్వహించగా చైనా కి సంబంధించిన కొన్ని సంచలన నిజాలు బయటపడడం జరిగింది.

దానిలో భాగంగానే చైనా అమ్మాయి లను ఎర వేసి వేరే దేశాల అధికారుల రహస్యాలను కాజేసిన ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే ఇలా చేయడానికి కారణం చైనా కి సంబంధించిన టెలికామ్ కార్యకలాపాలను మెరుగు పర్చుకునేందుకే ఇలా చేసినట్లు వెల్లడైంది. అలా బ్రిటన్ కి చెందిన కొంత మంది రాజకీయనాయకుల దగ్గరికి అందమైన అమ్మాయి లను పంపి అక్కడి రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేసింది అంట. కేవలం ఇలాంటి విషయాలు మాత్రమే కాకుండా కొంత మంది రాజకీయనాయకుల దగ్గరికి అమ్మాయి లను పంపిన తరువాత వారు కలిసినటువంటి ప్రైవసీ పిక్స్ మరియు వీడియో లు దొంగచాటుగా రికార్డ్ చేసి వాటి ద్వారా కొంత మంది అధికారులని బ్లాక్ మెయిల్ కూడా చేయడం జరిగింది అని బ్రిటన్ మరియు అమెరికా అధికారులు నిర్వహించిన విచారణ లో వెళ్ళెడైనట్లు చెప్పుకొచ్చారు.

కేవలం బ్రిటన్ లో మాత్రమే కాకుండా చాలా దేశాల లో కూడా ఇలాంటి కార్యకలాపాలను చైనా జరిపినట్లు తెలుస్తుంది. అగ్ర రాజ్యం గా మారడం మరియు ఆధిక్యత సంపాదించడం కోసం చైనా చేస్తున్న పనులని గమనిస్తే అన్ని దేశాల నాయకులు మరియు ప్రజలు సైతం ధిగజారుతున్న చైనా అంటూ కామెంట్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతలా బయటి దేశాల్లో చైనా పైన నేగిటివిటి పెరుగుతున్నప్పటికీ ఆ దేశం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా వెళ్తుంది. . ఈ విచారణ నివేదిక ప్రకారం ప్రపంచ దేశాలు చైనా పైన ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here