Boyfriend: అత్త‌కు బాయ్ ఫ్రెండ్ కావాల‌ని ప్ర‌క‌ట‌న ఇచ్చిన కోడ‌లు

Boyfriend: ఒక‌ప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చేది. ఎవ‌రో మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా పెళ్లిళ్లు కుదిరేవి. కాని ఇప్పుడ‌లా కాదు మ్యాట్రిమోనీలు అంటూ సంబంధాలు చూసే చాలా సైట్లు పుట్టుకొచ్చాయి.ఇందులో వ‌రుడు, వ‌ధువుల‌ని ఇంట్లో కూర్చోనే వెతుక్కోవ‌చ్చు. లేదంటే పేపర్ ప్ర‌క‌ట‌న లేదంటే ఆన్‌లైన్ ప్ర‌క‌ట‌న ద్వారా వ‌రుడు లేదా వ‌ధువు కావాల‌ని ప్ర‌క‌ట‌న ఇస్తుంటారు.

Boyfriend

అయితే అమెరికా కోడ‌లు త‌న అత్త‌కు బాయ్ ఫ్రెండ్ కావాలనే విచిత్ర ప్ర‌క‌ట‌న ఇచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బాయ్‌ఫ్రెండ్‌గా వ‌చ్చే వారికి వెయ్యి డాలర్స్ ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించింది. అయితే వారికి కోడ‌లు కొన్ని ష‌ర‌తులు పెట్టింది. ఆ ష‌ర‌తులు ఏంటంటే బాయ్ ఫ్రెండ్‌గా వ‌చ్చే వారికి కమ్యునికేష‌న్ స్కిల్స్‌తో పాటు డ్యాన్స్ కూడా బాగా వచ్చి ఉండాల‌ట‌.

అస‌లు విష‌యం ఏంటంటే అమెరికాలోని న్యూయార్క్ కి చెందిన కోడ‌లు త‌న 51 ఏళ్ల అత్త‌య్య‌తో కాస్త స‌మ‌యం గ‌డిపి, ఆ త‌ర్వాత వివాహ కార్యక్ర‌మానికి హాజ‌రు అయ్యేందుకు ఓ బాయ్ ఫ్రెండ్ కావాల‌ని ప్ర‌క‌ట‌న ఇచ్చింది. బాయ్ ఫ్రెండ్ వ‌య‌స్సు 40-60 ఏళ్ల మ‌ధ్య ఉండాల‌ని అతను మాకు అద్దెకు కావాల‌ని క్రెయిగ్స్ లిస్ట్ అనే క్లాసిఫైడ్స్ వెబ్ సైట్‌లో ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

బాయ్ ఫ్రెండ్‌గా వ‌చ్చే వ్యక్తికి మంచి కమ్యునికేష‌న్ స్కిల్స్‌తో పాటు డ్యాన్స్ వ‌స్తే 960 డాలర్స్ అంటే సుమారు 72 వేల రూపాయ‌లు ఇస్తాన‌ని కోడ‌లు తెలిపింది. ప్ర‌స్తుతం ఈ ప్ర‌క‌ట‌న నెట్టింట వైర‌ల్‌గా మారగా, నెటిజ‌న్స్ స‌ర‌దాగా స్పందిస్తున్నారు.