ట్విన్స్ కి జన్మనిచ్చిన సెలబ్రెటీస్ ఎవరో తెలుసా..!

Admin - July 18, 2020 / 11:05 AM IST

ట్విన్స్ కి జన్మనిచ్చిన సెలబ్రెటీస్  ఎవరో తెలుసా..!

ప్రతి ఒక్కరి లైఫ్ లో పెళ్లి అనేది ఒక కీలక విషయం. ఇక పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టడం అనేది ఇంకా స్పెషల్. ఇక సాధారణంగా ఒకరికి జన్మను ఇస్తే నే చాలా ఆనందంగా ఉంటాం. అలాంటిది ఇక ట్విన్స్ కి జన్మను ఇస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇక మన నిత్యా జీవితంలో చాలా మంది ట్విన్స్ పిల్లల్ని చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది సెలబ్రెటీలు కూడా ట్విన్స్ కి జన్మను ఇచ్చారు. ఇప్పుడు వారు ఎవరో ఒకసారి చూద్దాం.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు అయినటువంటి మంచు విష్ణు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్నాడు. అయితే మంచు విష్ణు 2008 లో వేర్నికా ను పెళ్లి చేసుకోని ఆ తరువాత్త వారు 2011 సంవత్సరంలో ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చారు. ఇక వాళ్ళిద్దరి పేర్లు అరియనా,వివియనా. ఈ ఇద్దరు పిల్లలు కూడా బుట్ట బొమ్మల్ల చూడ ముచ్చటగా ఉంటారు.

ఇక రెండవ నటుడు బాలీవుడ్ కి చెందిన సంజయ్ దత్. సంజయ్ దత్ 2008 వ సంవత్సరంలో మన్యత ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్లిద్దరికీ కూడా ఒకేసారి ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి జన్మించారు.

ఇక మూడో నటి ఉదయభాను. ఒకప్పుడు ఉదయభాను బుల్లి తెరలో తన ప్రోగ్రామ్స్ తో అందరిని ఆకట్టుకునేది. ఇక ఉదయభానుకు కూడా ఇద్దరు ఆడ పిల్లలు ఒకేసారి జన్మించారు. వాళ్ళిద్దరి పేర్లు యువి నక్షత్ర మరియు భూమి ఆరాధ్య. నిజంగా వీళ్లిద్దరి పేర్లు బలే ముచ్చటగా ఉన్నాయి కదా.

ఇక నాలుగోవ నటుడు భరత్. ఇక అప్పట్లో బాయ్స్ సినిమా మరియు ప్రేమిస్తే సినిమాలలో నటించాడు భరత్ . ఇక ఈ రెండు సినిమాలతో అటు తమిళ్ లోను మరియు ఇటు తెలుగులోను అభిమానులను ఆధరించి శబాష్ అనిపించుకున్నాడు. ఇక భరత్ కి కూడా ఇద్దరు మగ పిల్లలు ట్విన్స్ ఉన్నారు.

ఇక ఐదవ నటి సన్నీ లియోన్. ఇక ఈ పేరు తెలియని వారు ఎవ్వరు ఉండరు. సన్నీ లియోన్ మొదటగా 2007 సంవత్సరం లో ఒక పాపా ను దత్తతు తీసుకొని మానవత్వాన్ని చాటుకుంది. ఆ తరువాత అదే సంవత్సరంలో ఆమె ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది.

ఆరో నటుడు బాలీవుడ్ కి చెందిన కరణ్ జోహార్. ఈ మధ్య “నేపోటిసం కా బాప్ కరణ్ జోహార్” అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు అందుకుంటున్నాడు. ఇక కరణ్ కి కూడా ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి ఉన్నారు. వీళ్లిద్దరు కూడా కవల పిల్లలే.

ఏడవ సెలబ్రెటీ బాలీవుడ్ కి చెందిన ఫరా ఖాన్. ఫరా ఖాన్ బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా మరియు డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక ఫరా ఖాన్ కి కూడా ఒకేసారి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us