చెవుల్లో నుండి కూడా కరోనా..!
Admin - July 25, 2020 / 04:41 PM IST

కరోనా మన శరీరంలోకి నోటి ద్వారా మరియు ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది అనే విషయం అందరికి తెలుసు. అలాగే మొన్నటి వరకు గాలిలో కూడా కరోనా వైరస్ విస్తరిస్తుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటె తాజాగా చెవుల్లో నుండి కూడా కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. కరోనా సోకి మరణించిన రోగుల చెవుల్లోని మస్టాయిడ్ అంటే చెవి లోపల వెనుక భాగంలోని మెత్తని ఎముకతో కూడిన ప్రాంతంలో కూడా కరోనా వైరస్ ఉందని పరిశోధకులు గుర్తించారు. అయితే కరోనా తీవ్రత పెరిగినప్పుడు రోగి శరీరం నుండే వైరస్ చెవుల్లోకి వెళుతోందా.. లేక చెవుల నుండే శరీరంలోకి ప్రవేశిస్తుందా.. అన్న సందేహాలు కలుగుతున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. మరికొంత మందిని పరిశీలించిన తరువాత ఈ విషయం పై స్పష్టత తెలుపనున్నారు.