సరికొత్తగా తెలంగాణ హెల్త్ బుల్ టెన్

Advertisement

తెలంగాణ లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. రాత్రి విడుదల చేసే హెల్త్ బుల్ టెన్ సరికొత్త పద్దతిలో ఉదయం విడుదల చేసింది.అయితే ఈరోజు విడుదల చేసిన బుల్ టెన్ లో మొత్తం 1593 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,059కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,264గా ఉన్నాయి. గత 24 గంటల్లో 998 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.అయితే ఇప్పటి వరకు కరోనా బారిన పది కొలుకున్న వారి సంఖ్య 41,332 కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 641 తరువాత రంగారెడ్డి లో171 మరియు తరువాత వరంగల్ అర్బన్ జిల్లాలో 131 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తెలంగాణలో శనివారం ఒక్కరోజే 15,654 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1593 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 3,53,425కు చేరింది. తెలంగాణలో సరాసరిన ప్రతి 10 లక్షల మందిలో 391 మందికి కరోనా టెస్టులు చేస్తున్నట్లు బుల్ టెన్ లో వివరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here