నిన్న హీరో అయిన కెసిఆర్ ఈ రోజు జీరో అయ్యాడా…?

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ తన తెలివితేటలతో తాను చేసే పనులతో ఎంతో మంచి పేరు తెచ్చుకొని రియల్ హీరో అని అందరి నోటా అనిపించుకున్నాడు అయితే ఇప్పుడున్న పరిస్థితులు మరియు నిర్లక్ష్యం వలన హీరో కాదు జీరో అంటూ ప్రతిపక్షాలు వారి అభిప్రాయాలని తెలుపుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే కరోనా భారత్ లోకి అడుగు పెట్టకముందే కరోనా కి సంబంధించిన మందులు, మాస్క్ లు, శానిటైజర్ లు ఇలా అన్నింటిని తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు కెసిఆర్. వాటితో పాటు ఎన్నో విధాలుగా ప్రజలకు జాగ్రత్తలు చెపుతూ ప్రజలలో ఒక రకమైన అవేర్నెస్ ని తీసుకు వచ్చి ప్రజల ఆరోగ్యం పైన, వారి ప్రాణాల పైన, కరోనా తో పోరాటం చేసే వైపుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చాడు. అన్ని ప్రభుత్వాల కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అంటూ ముందుగానే లాక్ డౌన్ ఏర్పాట్లు చేసే విధంగా ముందుకు వెళ్లి అందరి కంటే చివరిగా లాక్ డౌన్ ని తొలగిస్తూ ప్రభుత్వానికి ఎంత నష్టమైనా బరిస్తాము. అంటూ అదే విధంగా చేయడం జరిగింది.

ఇంకా లక్డౌన్ లో చాల మంది పేద ప్రజలకు అన్నదానం చేయడం వంటి ఎన్నో పేదలకు సహాయం చేసే పథకాలను ప్రవేశ పెట్టడం చేశారు . అలాగే నిత్యావసర సరకుల కోసం అకౌంట్ లలో డబ్బు వేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా లాక్ డౌన్ సమయం లో ఒక్కో చోట చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చడం కూడా చేశారాయన. ఈ విధంగా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ప్రజలను కాపాడే దిశగా అడుగులు వేయడం తో కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే తెలంగాణ ప్రజలు సైతం ఇలా అందరూ ఈ కరోనా సమయం లో కెసిఆర్ నిజమైన యోధుడిలా పోరాడుతున్నాడు అంటూ పలు ప్రశంసలతో ఎంతగానో పొగడడం జరిగింది .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here