నా ఊహలు ఎవరికి అందవు: ఆర్జీవీ

Advertisement

పవర్ స్టార్ సినిమాతో చిక్కులు వచ్చి పడిన కూడా కూల్ గా ముందుకు సాగుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే పవర్ స్టార్ సినిమాకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే ఆర్జీవీ కి సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు. కొంతమంది పవన్ అభిమానులు నిన్న రాత్రి ఆర్జీవీ ఇంటి మీదకు దాడికి దిగిన విషయం తెలిసిందే..! అంతేకాకుండా పవన్ అభిమానులు రాంగోపాల్ వర్మ మీద ఒక సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. “పరాన్న జీవి” అనే పేరుతో సినిమా తీస్తున్నారు. ఇప్పటికే ఈ టీజర్ ను నిన్న విడుదల చేసారు. దింట్లో ఆర్జీవీ గా కామెడియన్ షకలక శంకర్ నటించబోతున్నాడు. అయితే పరాన్న జీవి టీజర్ పై ఆర్జీవీ అభిప్రాయం అడగగా.. వోడ్కా తాగుతాను, అమ్మాయిలతో తిరుగుతాను, పోర్న్ చూస్తాను అని నేనే చెప్పాను. టీజర్ లో కూడా ఇదే ఉంది. నా గురించి వీళ్ళు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అసలు నేను చేసే పనులు వాళ్ళ ఊహకు కూడా అందవు. వాళ్ళు ఊహించే దానికన్నా నా చర్యలు ఘోరంగా ఉంటాయని వర్మ పరాన్నజీవి టీజర్ గురించి చెప్పుకొచ్చాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here