బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో కంటెస్టెంట్లు ఎవరో తెలుసా..!

Admin - August 5, 2020 / 07:59 AM IST

బిగ్ బాస్ నాలుగవ  సీజన్ లో కంటెస్టెంట్లు  ఎవరో తెలుసా..!

బిగ్ బాస్ సీజన్ 4 కోసం ప్రతిఒక్కరు వేచిచూస్తున్నారు. అయితే ఇప్పటికె బిగ్ బాస్ మూడు సీజన్లు అన్ని కూడా విజయవంతం అయ్యియి. కానీ సీజన్ 4 మాత్రం కరోనా దాటికి కాస్త ఆలస్యంగా ముందుకు వస్తుంది. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 4 గురించి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సీజన్ 4 ఆగష్టు 30 వ తేదీన ప్రారంభం అవుతుంది అని తెలుస్తుంది. అలాగే హోస్ట్ గా అక్కినేని నాగార్జున ను ఖరారు చేసినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి.

అలాగే నాగార్జునతో కొన్ని ప్రోమోలు కూడా షూట్ చేస్తుంది బిగ్ బాస్ టీం. అలాగే కరోనా వలన బిగ్ బాస్ 4 యాబై రోజులు మాత్రమే ఉండనుంది. కానీ తాజా సమాచారం ప్రకారం వంద రోజులకు పైగా తీయనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ షో స్టార్ మా మరియు హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. అంతేకాకుండా ఈ షో కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ట్రేండింగ్ కోసం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నాయి.

అలాగే ఈ షో ప్రథమంగా 15 మంది సెలబ్రెటీలతో ప్రారంభం కానుంది. అలాగే ఆ 15 మందితో 15 రోజులు సాగుతుంది. దాదాపుగా 100 కు పైగా ఎపిసోడులు ఉండనున్నాయి. అలాగే ఈ షో లో పాల్గొనే సెలబ్రెటీలు అందరికి కరోనా టెస్టులు చేశాకే బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు. ఇప్పటికే ఈ షో లో కాంటెస్టులను సెలక్ట్ చేసారని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ షో లో యాంకర్స్ విష్ణుప్రియ, వర్షిణి, మంజూష మరియు కొరియోగ్రాఫర్ రఘు, సింగర్ సునీత, మంగ్లీ, నోయల్, శ్రద్ధాదాస్, వైవ హర్ష, ప్రియా వడ్లమాని పేర్లు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us