NTR: లక్ష్మీ పార్వతి కోరికను విన్న ఎన్టీఆర్ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారు?

NTR: ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల పెళ్ళి తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు, తన చేతిలో చేయి వేసి లక్ష్మీ.. పెరాలసీస్ స్ట్రోక్ తో చనిపోతానని అనుకున్న సమయంలో తిరిగి నాకు ప్రాణం పోశావని.. అలాగే ఎన్నికల కోసం పోరాడలేనని అనుకున్నప్పుడు కూడా తనతో కలిసి నడిచావని.. తన గెలుపుకు కారణం లక్ష్మీ పార్వతేనని.. తాను ఇప్పుడు ఎన్టీఆర్ కు భాగ్య దేవతతో సమానం అని ఏం కావాలో అడగమని ఎన్టీఆర్ అడిగారట.

మరో భార్య అయితే ఏం కోరుకునేదో తెలీదు గానీ, లక్ష్మీ పార్వతి మాత్రం తాను అడిగింది ఒక్కటే అంటూ.. ఎన్టీఆర్ 1982 లో పార్టీ పెట్టినప్పుడు వారికి చాలా ఆశయాలన్నీ తనకు ఎంతగానో నచ్చేవని.. ఎందుకంటే తను కమ్యూనిస్టు ఫ్యామిలీలో పుట్టారని.. కొన్ని ఆదర్శ విధానాలకు కట్టుబడి ఉన్నదాన్నని.. అలాంటి ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో అవినీతి బాగా పెరిగిందని.. ఎన్నో ప్రచార పత్రికల్లో రాస్తున్నారని అవన్నీ చాలా బాధాకరంగా ఉన్నాయని అన్నారు.

పార్వతి మాట విని ఎన్టీఆర్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు చేసే అవినీతి చర్యలన్నీ ఆమె వివరించారు. ఇలాంటి సమస్యలు, అవకతవకలు జరగకుండా, అలాంటి నీతి లేని విధానాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తనకు మాటివ్వాలని అన్నారు. ఎన్టీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా, లక్ష్మీపార్వతి ఆశయాలు ఉన్నందుకు ఎంతో సంతోషపడ్డారట. అలాంటి గొప్ప ఆశయాలున్న వ్యక్తిని తన అనుకున్న వారే అత్యంత దారుణంగా మోసం చేశారు.

తన జీవితంలో ఎంతో దుర్భరమైన రోజన్నారు. ఎన్టీఆర్ ఆమెను వదిలేసి వెళ్ళిపోవడం ఎంతో బాధకరం అని.. తనను ఒక్కదాన్నే అలా వదిలేసి వెళ్ళిపోయారని.. తనతో పాటు వందేళ్ళ పాటు కలిసి ఉందామని పెళ్ళి చేసుకుని.. మధ్యలోనే వదిలి వెళ్ళిపోయారని బాధపడ్డారు.

ఆ తర్వాత లక్ష్మీ పార్వతి కి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఈ రాజకీయాలు వదిలేస్తే, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని అన్నారు. అలా చాలాసార్లు ఫోన్ చేసి చెప్పారట. కానీ ఎన్టీఆర్ ఆశయాల కోసం ఆయనకు ఇచ్చిన మాట కోసం వారందర్ని ఎదుర్కుని తట్టుకుని నిలబడ్డానని లక్ష్మీ పార్వతి ఇంటర్వ్యూలో తెలిపారు.