దగ్దమైన లక్ష్మీ నరసింహ స్వామి రథం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Advertisement

తూర్పు గోదావరి జిల్లాలోని సకినేటి పల్లి మండలంలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయంలో ఉన్న కళ్యాణోత్సవ రథం శనివారం అర్ధరాత్రి సమయంలో పూర్తిగా దగ్దమైంది. రథం దగ్దమవ్వడం వల్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీ.

ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వీలైనంత తొందరగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విచారణ అధికారిగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను నియమించారు. దేవాదాయశాఖ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి విచారణ చేపట్టాలని సూచించారు. రథం పునఃనిర్మాణానికి చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here