రియా చక్రవర్తికి మద్దతు తెలపడం నేరమా.. : మంచు లక్ష్మి ఆవేదన
Admin - October 8, 2020 / 06:31 AM IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో తన ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయట పడింది. ఇక దీనితో బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని బయటకు వచ్చింది. ఇక ప్రస్తుతం రియా చక్రవర్తిని ఎన్సీబీ విచారణ జరుపుతుంది. ఒక వైపు సుశాంత్ సింగ్ మరణానికి రియా చక్రవర్తి కారణమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉంటె టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్షి, తాప్సి వంటి పలువురు మాత్రం రియా కు మద్దతుగా నిలిచారు.

ఇక ఈ విషయం పై నెటిజన్లు మంచు లక్ష్మి పై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. నిజానిజాలు తెలియకుండా రియా కు ఎలా మద్దతు తెలుపుతారని సదరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలాగే రియా కు న్యాయం జరగాలని కోరుకునే మంచు లక్ష్మి, సుశాంత్ సింగ్ కు ఎందుకు న్యాయం జరగాలని కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది అయితే డ్రగ్స్ కేసులో మంచు లక్ష్మికి కూడా సంబంధం ఉంది ఏమో.. అందుకోసమే రియాకు మద్దతు తెలుపుతుంది అని స్పందిస్తున్నారు.
ఇక ఈ విషయాలకు మంచు లక్ష్మి స్పందించింది. ఒక సాటి మహిళగా రియాకు మద్దతు తెలపడం నేరమా అని ఆవేదనకు గురయ్యింది మంచు లక్ష్మి. ఇక తన పై వస్తున్న వార్తలు చూసి మా ఇంట్లో కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారని, రియాకు మద్దతు తెలపడం గుణపాఠం నేర్పిందని మంచు లక్ష్మి ఆవేదన చెందారు.