Prison: ఖాళీ స‌మ‌యంలో ఖైదీల‌తో శృంగారం.. అడ్డంగా బుక్కైన 26 ఏళ్ల జైలు అధికారిణి

Prison: బాధ్య‌తగా ప్ర‌వ‌ర్తించాల్సిన వారు విజ్ఞ‌త కూడా మ‌ర‌చిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. నేరస్తుల‌లో మార్పు తేవ‌ల్సిన ఓ జైలు అధికారిణి అన్నీ మ‌ర‌చిపోయి ఖైదీల‌తో శృంగారం జ‌రిపింది. నిబంధ‌న‌లు అన్నింటిని గాలికి వ‌దిలి ఖైదీల‌తో బ‌హిరంగ శృంగార కార్య‌కలాపాలు చేస్తూ విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తించింది. కాలిఫోర్నియాలో సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసు అంద‌రు ఉలిక్కిప‌డేలా చేసింది.

ప్రెస్నో కౌంటీలోని స‌వ‌ర‌ణ అధికారిణి టీనా గాంజాలెజ్‌(26)కు న్యాయ‌స్థానం రెండేళ్ల ప్రొబేష‌న్ ఏడు నెల‌ల జైలు శిక్ష విధించింది.2016 నుండి కౌంటీ జైల్లో ప‌ని చేస్తున్న టీనా.. త‌న‌కు నచ్చిన స‌మ‌యంలో ఖైదీలతో విచ్చ‌ల‌విడి శృంగారం చేసేది. ఓ సారి 11 మంది ఖైదీలు చూస్తుండ‌గా, మ‌రో ఖైదీతో సెక్స్ చేసింది.

అంతేకాదు ఖైదీల‌కు సెల్‌ఫోన్స్, బ్లేడులు కూడా స‌ర‌ఫ‌రా చేసేద‌ని, జైల్లో ఏవైన సోదాలు జరిగేట‌ప్పుడు ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు జారీ చేసేద‌ని జైలు అధికారి కోర్టుకు తెలిపారు. మ‌రోవైపు ఫోన్స్‌లో ఖైదీల‌తో అస‌భ్య‌కరంగా మాట్లాడుతూ.. ఆమె చేసిన నేరాల గురించి గొప్ప‌గా చెప్పుకునేద‌ని స‌ద‌రు అధికారి తెలిపారు. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌కు న్యాయ‌మూర్తి కూడా షాక్ అయ్యాడంటే ఆమె ప్ర‌వ‌ర్త‌న ఎలాంటిదో అర్ధం చేసుకోవ‌చ్చు.

గ‌తంలో ఆమెకు ఎలాంటి న్యాయ చ‌రిత్ర లేక‌పోవ‌డంతో శిక్ష‌ను త‌గ్గించారు. కాని ఆమె గురించి తెలుసుకున్న ప్ర‌తి ఒక్క‌రు క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఖైదీల‌లో మార్పు తీసుకురావ‌ల‌సిన ఆమె ఇలా చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.