మహిళా ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

Advertisement

ఏపీలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అయితే ఈ ఘటనకు గల కారణం ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని ఆరోపణ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ ను ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. అయితే సూపరిటెండెంట్ బాలకృష్ణన్ పై గత కొంతకాలంగా వేధింపుల ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బాలకృష్ణన్ పై విచారణ కమిటి ఏర్పాటు చేశారు. ఆ విచారణ కమిటీ ఎదుట బాధితుల ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. బాలకృష్ణన్ తమకు ఎలా వేధిస్తున్నారో చెప్పి బోరున విలపించారు. అయితే ఆయన వేధింపుల వల్లే మహిళా ఎక్సైజ్ ఎస్‌ఐ గీత ఆత్మహత్యాయత్ననికి పాల్పడిందని వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here