బిగ్ బాస్ లో లేడీస్ వార్

Advertisement

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ స్పెషల్ అప్ డేట్స్..
బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలు గడిచాయి. ఇద్దరు సీనియర్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ వీక్ సూర్యకిరణ్ వెళ్లిపోతే, సెకండ్ వీక్ కళ్యాణి వెళ్లిపోయింది. ఫస్ట్ వీక్ చేసిన మిస్టేక్స్ నుంచి కళ్యాణి ఇప్పుడిప్పుడే హౌస్ లో సెటిల్ అవుతోంది. ఫస్ట్ వీక్ అంతా చీటికి మాటికి అలగడం.., సింపథీ కోసం ట్రై చేయడం అనేది చేస్తూ వచ్చింది. చిన్న విషయాలకి పెద్దగా రియాక్ట్ అవ్వడం అనేది ఆడియన్స్ కి నచ్చలేదు. కళ్యాణి వెళ్లిపోతూ హౌస్ లో ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనేదాని పైన అందరికీ క్లారిటీ ఇచ్చింది.
అయితే, ఇప్పుడు మూడోవారంలో మాత్రం ఖచ్చితంగా లేడీస్ మద్య పెద్ద వార్ అయ్యేలాగానే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఏదైనా లగ్జరీ బడ్జెట్ టాస్క్ గట్టిగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా వార్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా లాస్య అండ్ దివిలకి గట్టిగా పడుతుంది. అలాగే, సుజాత అండ్ అరియానాలు కూడా తక్కువేం కాదు. ఇక దేత్తడి హారిక కూడా తన జోలికి వస్తే వదిలపెట్టదు. అనవరసంగా కెలికితే దేవి డాన్ లా మారుతుంది. మోనాల్ ఎమోషన్ ని ఆపడం కూడా ఎవరిల్లా కాదు.


ఇప్పుడు ఈ అమ్మాయిలతోనే చాలా డేంజర్. అబ్బాయిలు ఫిజికల్ టాస్క్ ఆడినా వెంటనే ఐదు నిమిషాలకి కూల్ అయిపోతారు. కలిసిపోతారు. కానీ అమ్మాయిలు అలా ఉండరు. కలవడానికి చాలా టైమ్ తీసుకుంటారు. వారిని కన్విన్స్ చేయడమే సరిపోతుంది. లాస్య – దివిలకి మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసు. దివి ఇప్పుడు అవకాశం కోసం చూస్తోంది. రాజశేఖర్ మాస్టర్ పిల్లో పెట్టడమే తప్పుగా అనిపించిన నీకు… మోనాల్ అభిని హగ్ చేసుకుని ముద్దుకూడా పెట్టింది. మరి అది తప్పుగా అనిపించలేదా..? అంతేకాదు, దేత్తడి హారిక గానీ, అరియానా కానీ అందరితోనూ క్లోజ్ గానే ఉంటున్నారు. మరోవైపు అఖిల్ మోనాల్ చుట్టూ ఈగ లాగా తిరుగుతున్నాడు. కనీసం ఈ విషయంలోనైనా లాస్య అఖిల్ ని జీరో అని చెప్పినా లాస్య టాప్ లో ఉండేది. అలా కాకుండా అరియనాలాగా ఆలూ కర్రీ వేయలేదని సిల్లీ రీజన్ చెప్పిన సేఫ్ అయ్యేది. ఇప్పుడు లాస్య మళ్లీ తనని ప్రూవ్ చేసుకోవాలి అంటే టైమ్ పట్టేస్తుంది. అందరితో మింగిల్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది.
సో ఇప్పుడు ఉండే టాస్క్ కానీ, ముందున్న వీక్స్ లో కానీ ఖచ్చితంగా లేడీస్ మద్యలో గట్టివార్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం.. ఏం జరగబోతోంది అనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here